ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి.. తర్వాత అసలు విషయం తెలిసి షాక్!

ABN , First Publish Date - 2022-06-03T22:04:34+05:30 IST

ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి.. తర్వాత అసలు విషయం తెలిసి షాక్!

ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. అతనికి ఆమె శారీరకంగా కూడా దగ్గరైంది.. ఒత్తిడి చేసి అతడిని వివాహం చేసుకుంది.. అయితే అతడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్ల లేదు.. ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్పేవాడు.. దీంతో అనుమానం వచ్చిన ఆమె రహస్యంగా అతడిని ఫాలో అయి అతడి ఇంటికి వెళ్లింది.. అక్కడకు వెళ్లాక ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది.. అప్పటికే అతనికి పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. షాకైన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఇది కూడా చదవండి..

పెళ్లైన ఏడాదికే యువకుడి ఆత్మహత్య.. చనిపోయే ముందు అతను చెప్పిన విషయాలు ఏంటంటే..


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో త్యాగినగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళకు ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా మనీష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య క్రమంగా స్నేహం పెరిగింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. దీంతో ఆ యువతి బలవంతం మేరకు మనీష్ ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెను తన ఇంటికి మాత్రం తీసుకెళ్లలేదు. ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్పేవాడు. దీంతో ఆ యువతికి అనుమానం మొదలైంది. గత బుధవారం మనీష్‌ను ఫాలో అయి అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ అతని భార్య, ఇద్దరు పిల్లలు కనిపించారు. 


ఇంట్లోకి వెళ్లిన ఆ యువతిని మనీష్ భార్య తన్ని తరిమేసింది. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి మనీష్‌పై ఛీటింగ్ కేసు, అత్యాచారం కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  


Updated Date - 2022-06-03T22:04:34+05:30 IST