3 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. మొదటిసారి పుట్టింటికి వెళ్లిన భార్యకు భారీ షాక్.. రేపు వస్తానంటూ భర్తకు ఫోన్ చేయగానే..!

ABN , First Publish Date - 2022-10-14T20:09:06+05:30 IST

రేపు ఇంటికి వస్తున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అది విన్న తర్వాత అతనికి ఏమయ్యిందో ఏంటో కానీ ఆమె మొబైల్ నంబర్ ను బ్లాక్ చేశాడు

3 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. మొదటిసారి పుట్టింటికి వెళ్లిన భార్యకు భారీ షాక్.. రేపు వస్తానంటూ భర్తకు ఫోన్ చేయగానే..!

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్ళికూడా చేసుకున్నారు. అమ్మాయి వైపు  బంధువులు చనిపోయారని పుట్టింటికెళ్ళింది, అక్కడ తతంగం అంతా ముగిసిపోయాక రేపు ఇంటికి వస్తున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అది విన్న తర్వాత అతనికి ఏమయ్యిందో ఏంటో కానీ ఆమె మొబైల్ నంబర్ ను బ్లాక్ చేశాడు. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో, జౌన్ పూర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..


వర్ష మహేశ్వరి అనే అమ్మాయి, దిలీప్ అనే అబ్బాయి ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. వర్షది ఘజియాపూర్ కాగా, దిలీప్‌ది జౌన్ పూర్. వారిధ్దరి మధ్య పరిచయం పెరిగిన తరువాత వారి వాట్సాప్ నెంబర్లు షేర్ చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు చాటింగ్ సాగింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి ఇష్టం ఏర్పడింది. వర్ష నాలుగైదు రోజులు మాట్లాడకపోతే దిలీప్ చాలా బాధపడేవాడు, చచ్చిపోతానని అనేవాడు. అంతగా వారిద్దరి మధ్య ప్రేమ ముదిరిపోయింది. ఒక రోజు దిలీప్‌తో వర్ష మాట్లాడుతూ.. మా ఇంట్లో నాకు పెళ్ళి సంబంధం చూసారని చెప్పగానే ఆమె బ్యాంక్ అకౌంట్‌కు అతడు డబ్బు పంపి లక్నోకు వచ్చేయమని చెప్పాడు. అతను చెప్పినట్టే వర్ష లక్నో వెళ్ళింది. అక్కడ దిలీప్ వాళ్ళ అక్క ఇంట్లో వర్షను ఉంచాడు. వారిద్దరూ ఆ తర్వాత అతని ఫ్రెండ్ ఇంట్లో కూడా కొన్నిరోజులున్నారు. అనంతరం ఇద్దరూ దిలీప్ స్వస్థలమైన జౌన్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ కోర్టు సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. 


పెళ్ళి తరువాత దిలీప్ ఇంట్లోనే వారద్దరూ కాపురం ప్రారంభించారు. అలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో ఎదురైన సమస్య ఏమిటంటే.....


వారిద్దరి పెళ్ళి జరిగిన మూడునెలలు తరువాత వర్ష వాళ్ల అన్నయ్య చనిపోయినట్టు తెలియడంతో ఆమె పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తరువాత ఆమెకు, దిలీప్‌కు మధ్య ఫోన్‌లో చాలా వాదన జరిగింది. పుట్టింటికి వెళ్ళడంపై వర్షతో దిలీప్ గొడవ పడ్డాడు. అనంతరం దిలీప్, అతడి తల్లిదండ్రులు కూడా వర్ష నెంబర్ బ్లాక్ చేశారు. వర్ష అతనికి ఎంత నచ్చజెప్పాలని చూసినా ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి నాకు విడాకులు కావాలి అంటూ దిలీప్ తన బావమరిది అయిన పీయూష్‌తో కబురు పంపించాడు. ఇంత జరిగిన తరువాత దిలీప్ మీద అతని కుటుంబంలో ఉన్న మొత్తం ఆరు మంది సభ్యుల మీద వర్ష పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిని అవమానించారని, అసభ్యంగా మాట్లాడారని పేర్కొంటూ జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more