వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు.. భార్య పక్కా స్కెచ్.. ఆ తర్వాతే భర్త ఎంట్రీ.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2022-01-21T22:08:11+05:30 IST

కొందరు దంపతులు కూడా చూడ్డానికి సంస్కారవంతంగా కనిపిస్తుంటారు. కానీ వారి గురించి అసలు నిజాలు తెలిశాక, ‘‘వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు’’.. అని అనుకుంటాం. ఇటీవల జైపూర్‌లో ఇలాంటి దంపతులు ఏం చేశారంటే..

వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు.. భార్య పక్కా స్కెచ్.. ఆ తర్వాతే భర్త ఎంట్రీ.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు..!

కొందరు బయటికి మాత్రం ఆదర్శ పురుషుల్లా కనిపిస్తుంటారు. చూస్తే చాలా మంచి వాళ్లు అనిపించేలా ఉంటారు. ఏమాత్రం అనుమానం రాకుండా తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. తీరా జరగాల్సిన నష్టం జరిగాక.. అవాక్కవడం బాధితుల వంతవుతుంది. కొందరు దంపతులు కూడా చూడ్డానికి సంస్కారవంతంగా కనిపిస్తుంటారు. కానీ వారి గురించి అసలు నిజాలు తెలిశాక, ‘‘వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు’’.. అని అనుకుంటాం. ఇటీవల జైపూర్‌లో ఇలాంటి దంపతులు ఏం చేశారంటే..


రాజస్థాన్ అల్వార్‌కు చెందిన హిమాన్షు(30) అనే వ్యక్తి, విద్యాశాఖలో ఎల్‌డీసీగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఏడాది క్రితం బుండీ అనే ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారు. విధులకు వెళ్తూ, వస్తూ ఉండే క్రమంలో అతడికి ప్రియా శర్మ అనే వివాహిత పరిచయమైంది. హిమాన్షు వద్ద డబ్బులు బాగా ఉన్నాయన్న విషయం తెలుసుకున్న ప్రియాశర్మ.. అతడికి ప్రేమ పేరుతో దగ్గరైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, కొన్నాళ్ల తర్వాత హిమాన్షును బెదిరించడం మొదలెట్టింది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. అత్యాచార కేసులు పెట్టిస్తానని అనడంతో హిమాన్షు భయపడిపోయాడు. తర్వాత ప్రియాశర్మ భర్త వివేక్‌ కూడా సీన్‌లోకి ఎంటరయ్యాడు. ఇద్దరూ కలిసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు.

గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..


ప్రియాశర్మ, ఆమె భర్త చేష్టలతో భయపడిపోయిన హిమాన్షు..  2021 అక్టోబర్‌లో తన ఉద్యోగాన్ని అల్వార్‌కు బదిలీ చేయించుకున్నాడు. ప్రియాశర్మ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడు. అయితే హిమాన్షుకు తెలిసిన వారు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అతడి చిరునామా తెలుసుకుని భర్తతో పాటూ నేరుగా అల్వార్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో కొందరు మధ్యవర్తులు జోక్యం చేసుకుని, పంచాయితీ చేసి రూ.18లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. గురువారం సాయంత్రం వారు చెప్పిన ప్రదేశంలో డబ్బులు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..


ప్రియాశర్మ దంపతులకు హిమాన్షు డబ్బులు ఇవ్వగానే పోలీసులు ఎంటరయ్యారు. నిందితురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే స్టేషన్‌కు వెళ్లగానే ప్రియాశర్మ ఏడవడం మొదలెట్టింది. ‘‘దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి.. ఏదో డబ్బులకు ఆశపడి ఇలాంటి పని చేశాం’’... అంటూ పోలీసులను వేడుకున్నారు. నిందితుల నుంచి రూ.3 లక్షల నగదు, రూ.15 లక్షల చెక్కును, ఒప్పంద పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు..

Read more