భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే కోపంతో.. కూతురును అడ్డుపెట్టుకుని అతడు వేసిన ప్లాన్.. విచారణలో విస్తుపోయే నిజాలు

ABN , First Publish Date - 2022-01-09T01:42:11+05:30 IST

సవ్యంగా సాగుతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి అనుకోని ఘటన చోటుచేసుకుంది. కళ్ల ముందున్న భార్య అనుకోకుండా కనిపించకుండా పోయింది. ప్రియుడితో వెళ్లిందని తెలుసుకుని కోపం పెంచుకున్నాడు. భార్యను తీసుకెళ్లిన వ్యక్తిపై...

భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే కోపంతో.. కూతురును అడ్డుపెట్టుకుని అతడు వేసిన ప్లాన్.. విచారణలో విస్తుపోయే నిజాలు
పోలీసుల అదుపులో నిందితుడు

సవ్యంగా సాగుతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి అనుకోని ఘటన చోటుచేసుకుంది. కళ్ల ముందున్న భార్య అనుకోకుండా కనిపించకుండా పోయింది. ప్రియుడితో వెళ్లిందని తెలుసుకుని కోపం పెంచుకున్నాడు. భార్యను తీసుకెళ్లిన వ్యక్తిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన 11ఏళ్ల కూతురుని అడ్డుపెట్టుకుని పథకం పన్నాడు. చివరకు అతడు చేసిన పని తెలుసుకుని పోలీసులతో పాటూ గ్రామస్తులంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్‌లోని అరారియా జిల్లాలోని పలాసిలో రాజేష్ పండిట్ అనే వ్యక్తి.. భార్య, 11ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇన్నేళ్ల వరకూ సవ్యంగా సాగిన వారి సంసారంలో అనుకోని సమస్య తలెత్తింది. 11ఏళ్ల కూతురు ఉన్న ఆమెకు పాడు బుద్ధి పుట్టింది. సూరజ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్తకు తెలీకుండా అతడితో చాలా రోజులు రాసలీలలు సాగించింది. ఇటీవల ఈ విషయం భర్తకు తెలిసింది. అప్పటి నుంచి అతను సూరజ్‌పై పగ పెంచుకున్నాడు.

పదేళ్లుగా ఒంటరిగా ఉన్న వ్యక్తి.. అనుకోకుండా రోబోతో ప్రేమ.. ఫైనల్‌గా అతను ఏమంటున్నాండంటే..


ఈ క్రమంలో అతడి భార్య, ప్రియుడు సూరజ్‌.. ఇంటి నంచి పారిపోయారు. దీంతో రాజేష్ వారిపై మరింత రగిలిపోయాడు. ఎలాగైనా సూరజ్‌ను జైలుకు పంపించాలని పథకం పన్నాడు. అందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నా.. రాజేష్ దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఓ రోజు కూతురును హత్య చేసి, మృతదేహం పక్కన తన భార్య, ప్రియుడి ఫొటోలను పడేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజేష్‌పై అనుమానం కలగడంతో పిలిపించి విచారించారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..

Updated Date - 2022-01-09T01:42:11+05:30 IST