Kitchen: వంట గది సింక్ నుంచి వింత శబ్ధాలు.. భయం భయంగానే వెళ్లి చూస్తే.. షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-07-10T20:53:20+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పాములున్నాయి. వాటిలో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని ఎవరికీ హాని తలపెట్టవు. సాధారణంగా పామును చూస్తే మాత్రం చాలామంది దూరంగా పారిపోతారు..

Kitchen: వంట గది సింక్ నుంచి వింత శబ్ధాలు.. భయం భయంగానే వెళ్లి చూస్తే.. షాకింగ్ సీన్..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పాములున్నాయి. వాటిలో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని ఎవరికీ హాని తలపెట్టవు. సాధారణంగా పామును చూస్తే మాత్రం చాలామంది దూరంగా పారిపోతారు. కానీ ఓ ఇంట్లో మాత్రం ఒక పాము కాదు.. ఏకంగా 22 పాములు బుసలు కొడతూ కనిపించాయి. వంటింటి గదిలో తలదాచుకున్న పాములు ఒక్కసారిగా బయటకు రావడంతో ఇంట్లో వాళ్లంతా హడలిపోయారు.


ఇండోర్‌లోని రౌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేట్‌ రోడ్‌లో నితిన్ పాటిల్ అనే వ్యక్తి కిచెన్‌ సింక్‌లో వింత శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా.. 22 పాములు ఒకదాని వెంట మరొకటి బయటకు వచ్చాయి. ఒక్కసారిగా ఇంట్లోని సింక్‌ నుంచి అన్ని పాములు బయటపడడంతో నితిన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. పాముల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఇళ్లంతా సెర్చ్ చేయగా మరిన్ని పాములు బయటపడ్డాయి. పాములను పట్టుకున్న సిబ్బంది.. వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 

మహిళ ఒక్కటే ఉందని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందంటే..



Updated Date - 2022-07-10T20:53:20+05:30 IST