బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..

ABN , First Publish Date - 2022-01-16T02:05:46+05:30 IST

బీకాం చదువుతున్న ఓ యువతి చూడటానికి హుందాగా ఉంటుంది. ఆమె తల్లి కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీరిద్దరూ కలిసి చేసే పనులే అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాయి..

బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..
ప్రతీకాత్మక చిత్రం

బీకాం చదువుతున్న ఓ యువతి చూడటానికి హుందాగా ఉంటుంది. ఆమె తల్లి కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీరిద్దరూ కలిసి చేసే పనులే అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాయి. తల్లీకూతుళ్లను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేయగా.. వారు చేసిన పనులన్నీ బయటపడ్డాయి. ఢిల్లీలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీ ఈశాన్య జిల్లా పరిధిలోని అంబేద్కర్ నగర్‌‌లో ఓ మహిళ కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. పైకి హుందాగా కనిపించే తల్లీకూతుళ్లలో మరో కోణం  దాగుందనే విషయం స్థానికులు తెలుసుకోలేకపోయారు. తల్లీకూతుళ్లు కలిసి రోజూ స్కూటీలో దర్జాగా బయటకు వెళ్తారు. ఏదో పనిమీద వెళ్తున్నారులే అనుకున్న స్థానికులు.. చివరకు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. డిసెంబర్ 31న ఈ తల్లీకూతుళ్లు, జఫ్రాబాద్‌‌లోని ఓ నగల దుకాణానికి వెళ్లారు. హుందాగా కనిపించడంతో, వ్యాపారి తన షాపులోని వివిధ రకాల నగలను వారి ముందు ఉంచాడు. అతని పనిలో అతడు ఉండగా.. నగలను బాక్సులను మాయం చేశారు. తర్వాత అక్కడి నుంచి తాపీగా బయటికి వెళ్లిపోయారు. 


నగలు చోరీ అయ్యాయనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన షాపు యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాపులోని సీసీ ఫుటేజీని పరిశీలించగా తల్లీకూతుళ్ల బండారం బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తమ నేరాలన్నీ అంగీకరించారు. రోజూ ఖరీదైన దుస్తులు వేసుకుని బయటికి వెళ్లే వీరు.. వివిధ చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో తల్లిపై మూడు, కుమార్తెపై రెండు చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించారు.

Updated Date - 2022-01-16T02:05:46+05:30 IST