రెండేళ్లుగా కనిపించని భార్య, కొడుకు.. ఇటీవల బారులో స్నేహితులతో కలిసి బీరు తాగుతూ భర్త చెప్పిన మాటతో..

ABN , First Publish Date - 2022-10-11T21:35:53+05:30 IST

అతడు రెండో వివాహం చేసుకుని ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్లుగా మొదటి భార్య, ఏడు నెలలుగా కొడుకు కనిపించలేదు. అదృశ్యమై ఉంటారని అంతా అనుకున్నారు. పోలీసులు..

రెండేళ్లుగా కనిపించని భార్య, కొడుకు.. ఇటీవల బారులో స్నేహితులతో కలిసి బీరు తాగుతూ భర్త చెప్పిన మాటతో..
ప్రతీకాత్మక చిత్రం

అతడు రెండో వివాహం చేసుకుని ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్లుగా మొదటి భార్య, ఏడు నెలలుగా కొడుకు కనిపించలేదు. అదృశ్యమై ఉంటారని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా ఈ కేసును ఛేదించలేకపోయారు. వారిని అంతా మర్చిపోతున్న తరుణంలో ఇటీవల భర్త తన స్నేహితులతో కలిసి బారుకు వెళ్లాడు. అంతా కలిసి బీరు తాగుతూ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య, కొడుకు గురించి భర్త చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ పరిధి రతన్‪‌గఢ్ ప్రాంతానికి చెందిన శివరాజ్ చౌహాన్ అలియాస్ రాజా అనే వ్యక్తికి భార్య ఆస్తా, కుమారుడు ఉండేవారు. అయితే ఉన్నట్టుండి 2020మే నుంచి శివరాజ్ భార్య కనిపించకుండా పోయింది. మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయినా ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 8నుంచి శివరాజ్ కొడుకు కూడా కనిపించకుండా పోయాడు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే ఎంతమందిని విచారించినా, ఎంత దర్యాప్తు చేపట్టినా వారి ఆచూకీని మాత్రం కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో భర్త మనీషా అనే యువతిని రెండో వివాహం (Second marriage) చేసుకుని ఆనందంగా ఉండేవాడు. ప్రస్తుతం దటియా అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

విదేశాల నుంచి ఇటీవలే ఇంటికొచ్చిన భర్త.. సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా భార్య గర్భిణి అని తెలిసి..


ఇటీవల తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు బారుకు వెళ్లాడు. అంతా కలిసి ఫుల్‌గా బీర్లు తాగారు. బాగా మత్తులో ఉన్న శివరాజ్.. తన మనుసులోని మాటను బయటపెట్టాడు. రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో శివరాజ్.. తన మొదటి భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మొఖం గుర్తుపట్టకుండా పెట్రోలు పోసి కాల్చేశాడు. తన భార్య అదృశ్యమైందంటూ నాటకం ఆటాడు. తర్వాత అడ్డుగా ఉన్న కొడుకును కూడా ఈ ఏడాది హత్య చేసినట్లు చెప్పాడు. ఈ విషయం విన్న స్నేహితులంతా షాక్ అయ్యారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు.. శివరాజ్‌ను అదులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Woman theft: ముందు అమాయకురాలని అనుకున్నాడు.. కాసేపటికి తేరుకుని అవాక్కయిన బంగారు వ్యాపారి..Read more