అవును.. 9 రోజుల క్రితం పుట్టిన కూతుర్ని ఎవరికీ తెలీకుండా నేనే చంపానంటూ ఆ తండ్రి చెప్పిన కారణం విని అంతా షాక్..!

ABN , First Publish Date - 2022-09-14T01:04:18+05:30 IST

సొంత పిల్లల్ని చంపుకొనేంత క్రూరత్వం సాధారణంగా ఎవరికీ ఉండదు. అయితే కొందరు మాత్రం నిర్ధాక్షిణ్యంగా తమ పిల్లలను పొట్టున పెట్టుకుంటుంటారు. ప్రధానంగా ఆడపిల్లలు పుట్టిన..

అవును.. 9 రోజుల క్రితం పుట్టిన కూతుర్ని ఎవరికీ తెలీకుండా నేనే చంపానంటూ ఆ తండ్రి చెప్పిన కారణం విని అంతా షాక్..!

సొంత పిల్లల్ని చంపుకొనేంత క్రూరత్వం సాధారణంగా ఎవరికీ ఉండదు. అయితే కొందరు మాత్రం నిర్ధాక్షిణ్యంగా తమ పిల్లలను పొట్టున పెట్టుకుంటుంటారు. ప్రధానంగా ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 9 రోజుల క్రితం పుట్టిన కూతుర్ని ఎవరికీ తెలీకుండా నేనే చంపేశా.. అంటూ తండ్రి తెలిపాడు. చివరకు చంపడానికి గల కారణాన్ని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మథురలోని థానా రాయ ప్రాంతంలోని బనా అనే గ్రామానికి చెందిన సత్యపాల్‌కు భార్య, 19ఏళ్ల కొడుకు, 6, 3సంవత్సరాల వయసున్న కుమార్తెలు ఉన్నారు. కాగా, ఆగస్టు 27న సత్యపాల్ భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇదిలావుండగా, సెప్టెంబర్ 4న తల్లి పక్కన పాప సడన్‌గా కనిపించకుండాపోయింది. సత్యపాల్ భార్యకు మాటలు రాకపోవడంతో సైగలు చేస్తూ భర్తతో పాటూ చుట్టుపక్కల వారికి అందరికీ తెలియజేసింది. అంతా కలిసి వెతికినా ఎక్కడా కనిపించలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బెదిరించి రూ.1.30 లక్షల్ని కొట్టేశారంటూ ఓ కుర్రాడి కేసు.. అతడి ఫోస్ స్విచాఫ్‌లోనే ఉండటంతో పోలీసులకు కొత్త డౌట్.. చివరకు..


దర్యాప్తు చేస్తుండగా గ్రామానికి సమీపంలోని చెరువులో శిశువు మృతదేహం (baby dead body) కనిపించింది. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం ఇచ్చి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులకు తండ్రిపై అనుమానం వచ్చింది. చివరకు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. తనకు అప్పటికే 19, 6, 3సంవత్సరాల పిల్లలు ఉన్నారని, ఈ వయసులో మళ్లీ పాప పుట్టడంతో ప్రజలు ఎగతాళి చేస్తారేమో అని చంపేసినట్లు తెలిపాడు. అతడి సమాధానం విని పోలీసులతో పాటూ స్థానికులంతా షాక్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

8 నెలల పాపకు ఎందుకిలా అయిందో తెలిస్తే.. ఫోన్‌ను పిల్లల దరిదాపులకు కూడా రానివ్వరు.. తల్లి బాత్రూంకు వెళ్లిన టైమ్‌లో..Read more