Viral News: ప్రతి పురుషుడికి రెండు పెళ్లిళ్లు.. లేదు.. కుదరదంటే జీవిత ఖైదు!

ABN , First Publish Date - 2022-08-20T15:49:25+05:30 IST

అక్కడ ప్రతి పురుషుడు.. కచ్చితంగా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందే. లేదు.. చేసుకోను అంటే అస్సలు కుదరదు. రెండు పెళ్లిళ్లు చేసుకోని పురుషుడిని నేరస్థుడిలా చూస్తారు. అంతేకాదండోయ్.. అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

Viral News: ప్రతి పురుషుడికి రెండు పెళ్లిళ్లు.. లేదు.. కుదరదంటే జీవిత ఖైదు!

ఇంటర్నెట్ డెస్క్: అక్కడ ప్రతి పురుషుడు.. కచ్చితంగా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందే. లేదు.. చేసుకోను అంటే అస్సలు కుదరదు. రెండు పెళ్లిళ్లు చేసుకోని పురుషుడిని నేరస్థుడిలా చూస్తారు. అంతేకాదండోయ్.. అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం లేదు. సాక్షాత్తు ప్రభుత్వమే చెబుతోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజం. అయితే.. ఇటువంటి చట్టం ఎక్కడ ఉంది? అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం తెలియాలంటే పూర్తి వివరాల్లో(Viral News)కి వెళ్లాల్సిందే..



అది తూర్పు ఆఫ్రికాలోని దేశం. ఆ దేశం పేరు ఎరిత్రియా(Eritrea in Africa). ఇక్కడే ఈ వినూత్న చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ దేశంలో ప్రతి పరుషుడు తప్పనిసరిగా ఇద్దరు మహిళలను వివాహం( men should get two marriages) చేసుకోవాలి. భర్త రెండో పెళ్లికి మొదటి భార్య కూడా తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుంది. వివాహానంతరం భర్త తన ఇద్దరు భార్యలను బాగా చూసుకోవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతుండగా.. ప్రభుత్వం(Eritrea Govt) కూడా ఈ పద్ధతికి ఆమోదముద్ర వేసి, దాన్ని చట్టంగా మార్చింది. దీంతో చట్ట ప్రకారం.. ఒక వేళ ఎవరైనా రెండో పెళ్లి చేసుకోను అంటే.. మాత్రం అతడిని అందరూ నేరస్థుడిలా చూస్తారు. అంతేకాదు.. సదరు వ్యక్తికి జీవిత ఖైదు(Life Imprisonment) పడే అవకాశం కూడా ఉంది. 


రెండు పెళ్లిళ్లకు కారణం ఇదే..

ఎరిత్రియా దేశంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కనసాగడానికి.. అక్కడి ప్రభుత్వం ఈ పద్ధతిని చట్టంగా మార్చి అమలు చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఆ దేశంలోని స్త్రీల సంఖ్యే దీనికి కారణం. పురుషుల కంటే.. అక్కడ స్త్రీల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ఆమోదముద్ర వేసి, చట్టంగా మార్చింది. 


Updated Date - 2022-08-20T15:49:25+05:30 IST