ఏమైందమ్మా! మౌనంగా ఉన్నావ్.. అని అడిగిన తండ్రి.. పొలంలో ఒంటరిగా ఉండగా కొందరు.. అంటూ చెప్పుకొచ్చిన బాలిక..

ABN , First Publish Date - 2022-07-08T03:29:02+05:30 IST

మహిళలు ఒంటరిగా బయటికి వెళ్తే.. క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేని రోజులివి. అలాంటిది ఇక బాలికల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు శాడిస్టులు ప్రేమ...

ఏమైందమ్మా! మౌనంగా ఉన్నావ్.. అని అడిగిన తండ్రి.. పొలంలో ఒంటరిగా ఉండగా కొందరు.. అంటూ చెప్పుకొచ్చిన బాలిక..

మహిళలు ఒంటరిగా బయటికి వెళ్తే.. క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేని రోజులివి. అలాంటిది ఇక బాలికల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు శాడిస్టులు ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే.. మరికొందరు దుర్మార్గులు బలవంతంగా దాడులు చేసి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మౌనంగా ఉన్న కూతురిని చూసి.. ఏమైందమ్మా.. అని తండ్రి అడిగాడు. దీంతో ఆమె ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్ రాష్ట్రం పాలి పరిధిలో నివాసం ఉంటున్న పదో తరగతి బాలికపై 2021లో కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పొలంలో ఒంటరిగా ఉన్న బాలికను కొందరు యువకులు గమనించారు. చప్పుడు చేయకుండా ఆమె వద్దకు వెళ్లి.. ఒక్కసారిగా నోరు మూసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం ఎనిమిది మంది యువకులు కలిసి అత్యాచారం చేశారు. స్పృహలోకి వచ్చిన బాలిక.. జరిగిన విషయం తెలుసుకుని వారిని నిలదీసింది. దీంతో వీడియోలు చూపించిన యువకులు.. ఎవరికైనా చెబితే అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయపడి.. ఎవరికీ చెప్పలేదు. వీడియోల సాకు చూపిస్తూ తరచూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవారు.

స్నేహితురాలితో కలిసి చెరువు వద్ద స్నానం చేస్తున్న బాలిక.. ఇంటికి రాగానే ఊహించని ఘటన.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం..


ఈ ఏడాది మే 4వ తేదీన బాలికను కారులో ఎక్కించుకుని జైపూర్‌ తీసుకెళ్లారు. వాహనంలోనే అంతా కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం 5వ తేదీన బాలికను గ్రామ సమీపంలో వదిలిపెట్టారు. ఇంటికి వచ్చిన బాలిక.. మౌనంగా ఉండడంతో కుటుంబ సభ్యలకు అనుమానం వచ్చింది. ఏమైందమ్మా! అని తండ్రి అడగడంతో.. ఏడుస్తూ జరిగిన దారుణం గురించి చెప్పేసింది. అనంతరం అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితురాలిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. బాలిక వాంగ్మూలం తీసుకున్న అనంతరం ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించాలి పోలీసులను ఆదేశించారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం.. క్లూ కోసం వెతుకుతుండగా అరచేతిలో కనిపించిన అక్షరాలు.. ఇంతకీ ఆమె ఏం రాసుకుందంటే..

Read more