మేడమ్! మసాజ్ చేయించుకుంటే సమస్యలు దూరమవుతాయ్.. అంటూ టూరిస్ట్‌తో అన్నాడు.. గదిలోకి వెళ్లిన కాసేపటికి చూస్తే..

ABN , First Publish Date - 2022-03-20T00:29:31+05:30 IST

అన్నం పెట్టిన వృత్తినే దైవంలా భావిస్తుంటారు. మనసా, వాచా, కర్మనా.. పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇంకొందరు మాత్రం వృత్తి ముసుగులో...

మేడమ్! మసాజ్ చేయించుకుంటే సమస్యలు దూరమవుతాయ్.. అంటూ టూరిస్ట్‌తో అన్నాడు.. గదిలోకి వెళ్లిన కాసేపటికి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

వృత్తి పట్ల అంకితభావంతో పని చేసే వారు ఎందరో ఉంటారు. అన్నం పెట్టిన వృత్తినే దైవంలా భావిస్తుంటారు. మనసా, వాచా, కర్మనా.. పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇంకొందరు మాత్రం వృత్తి ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరు డబ్బుల కోసం అక్రమాలు చేస్తే.. మరికొందరు అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతుంటారు. నిజానిజాలు వెలుగులోకి వస్తేగానీ వారి అసలు స్వరూపం బయటపడదు. రాజస్థాన్‌లో గైడ్‌గా పని చేసే వ్యక్తి చేసిన పనే ఇందుకు నిదర్శనం. గైడ్‌గా టూరిస్ట్‌లను అతిథులుగా చూసుకుని, అన్ని ప్రాంతాలను చూపించి.. క్షేమంగా పంపిచాల్సిన ఆ వ్యక్తి, అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌ రాష్ట్రం ఖతీపురా ప్రాంతంలో నివాసం ఉంటున్న కేరళకు చెందిన నిందితుడు బిజు మురళీధరన్‌.. స్థానికంగా గైడ్‌గా పని చేస్తుంటాడు. టూరిస్టులకు  రాజస్థాన్‌ పరిధిలోని పర్యాటక ప్రాంతాలను చూపించడం, వాటి విశిష్టత, చరిత్రను తెలియజేస్తూ ఉండేవాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇటీవల అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో డచ్‌కు చెందిన ఓ మహిళ గత బుధవారం రాజస్థాన్ వచ్చింది. గైడ్ మురళీధరన్‌‌ ఆమెతో మాట్లాడి తనను తాను పరిచయం చేసుకున్నాడు. పర్యాటక ప్రదేశాలను చూపించాల్సింది పోయి.. ఆమెతో ‘‘మేడమ్! ఇక్కడ ఆయుర్వేద మసాజ్ ఎంతో పేమస్.. అది చేయించుకుంటే శారీరక సమస్యలు అన్నీ దూరమవుతాయ్’’ అంటూ నమ్మించాడు.

యువకులంతా కలిసి డ్యాన్స్ వేస్తున్నారులే అనుకుంటే.. చివరికి ఇలా జరిగిందేంటి.. ఎంత పని చేశావు తమ్ముడు..


గైడ్ మాటలు నమ్మిన విదేశీయురాలు అతడితో పాటే వెళ్లింది. సింధి క్యాంపులో ఉన్న హోటల్లో ఓ గదిని తీసుకున్నాడు. మహిళను అందులోకి తీసుకెళ్లి, ముందుగా కూల్‌డ్రింక్ తాగించాడు. అది తీసుకోగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ వెంటనే మురళీధరన్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించిన మహిళ.. తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. వారి ఫిర్యాదుతో జైపూర్ పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ పర్యాటక బృందంతో కలిసి మార్చి 12న ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన పేషంట్.. వీధి రౌడీలా మారిన వైద్యుడు.. కనీసం కనికరం కూడా లేకుండా..

Read more