Drunk Man: కుక్కపిల్లల తోక, చెవులు కోసి ఉప్పు కలిపి తిన్న మందుబాబులు

ABN , First Publish Date - 2022-12-15T09:04:28+05:30 IST

ఇద్దరు మందుబాబులు దారుణానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో..

Drunk Man: కుక్కపిల్లల తోక, చెవులు కోసి ఉప్పు కలిపి తిన్న మందుబాబులు
Drunk Man Chops Tail, Ear of Puppies

బరేలీ(ఉత్తరప్రదేశ్): ఓ మందుబాబు దారుణానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో వెలుగుచూసింది.(Bareilly) బరేలీ జిల్లాలోని ఫరీద్‌పూర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ వాల్మీకి, మరో వ్యక్తితో కలిసి మద్యం తాగుతూ రెండు కుక్కపిల్లల తోక, చెవులు కోసి వాటికి ఉప్పు పూసి మందుతో(Eats them with Salt) నంజుకున్నారు.(Drunk Man) కుక్కపిల్లల తోక, చెవులు కత్తిరించడంతో వాటికి తీవ్ర రక్తస్రావం జరిగింది.(Chops Tail, Ear of Puppies) కుక్క పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో వాటిని చికిత్స కోసం పశువైద్యశాలకు తరలించారు.

అమానవీయ చర్య

తాగుబోతులైన ముఖేష్ వాల్మీకి, మరో వ్యక్తి కలిసి మద్యం తాగుతూ ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఈ దారుణంపై పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యుడు ధీరజ్ పాఠక్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై జంతువుల క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశారు.

జంతు హింసపై వరుస కేసులు

బరేలీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అఖిలేష్ చౌరాసియా దర్యాప్తు ప్రారంభించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బరేలీ జిల్లాలో జంతు హింస కేసులు వెలుగులోకి రావడం మొదటిసారి కాదు.గతంలో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ఎలుక తోకకు రాయి కట్టి కాల్వలో ముంచి చంపడానికి ప్రయత్నించారని దర్యాప్తులో తేలింది. అనంతరం ఓ కుక్క పిల్లను రాయితో కొట్టి చంపి మృతదేహాన్ని పాతిపెట్టారు.గతంలో ఓ వ్యక్తి వీధికుక్కను కాలితో తన్నాడు. ఇలా బరేలీలో వరుసగా జంతు హింస కేసులు నమోదవుతున్నాయి.

Updated Date - 2022-12-15T09:08:14+05:30 IST