ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..

ABN , First Publish Date - 2022-01-14T21:30:22+05:30 IST

బెంగళూరులో ఓ యువకుడు ఉద్యోగంలో స్థిరపడి హాయిగా జీవితం గడపాలనే ఆలోచన పక్కన పెట్టి.. ఈజీ మనీ కోసం అమ్మాయి వేషం వేశాడు. అందమైన అమ్మాయిలకు ప్రేమ పేరుతో వల వేస్తూ..

ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..
నిందితుడు నాచప్ప

కొందరు యువకులు జల్సాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ.. చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. ఇంకొందరైతే ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేస్తూ.. వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. తప్పని తెలిసినా తీరు మాత్రం మార్చుకోవడం లేదు. బెంగళూరులో ఓ యువకుడు ఉద్యోగంలో స్థిరపడి హాయిగా జీవితం గడపాలనే ఆలోచన పక్కన పెట్టి.. ఈజీ మనీ కోసం అమ్మాయి వేషం వేశాడు. అందమైన అమ్మాయిలకు ప్రేమ పేరుతో వల వేస్తూ.. నమ్మకం ఏర్పడగానే అశ్లీల ఫొటోలు పంపేవాడు. చివరకు అతని జీవితం ఏమైందంటే..


బెంగళూరులోని బానస్‌వాడి ప్రాంతానికి చెందిన నాచప్ప, ఓ ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. కొడకు మంచి ఉద్యోగంలో స్థిరపడి వృద్ధాప్యంలో తమను బాగా చూసుకుంటాడులే.. అనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. చదువు మీద ధ్యాస పెట్టకుండా అతను చేసిన పని.. చివరికి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈజీగా డబ్బు సంపాదించాలని నిత్యం కలలు కనేవాడు. ఈ క్రమంలో 2021లో ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. తనను తాను లెస్బియన్‌గా చెప్పుకొంటూ అమ్మాయిలతో చాటింగ్ చేసేవాడు. అప్పుడప్పుడూ ఆడ వేషం ధరించి నమ్మించేవాడు. లెస్బియన్ శృంగారం పట్ల ఆసక్తి ఉన్నవారిని టార్గెట్ చేసేవాడు.

19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో..


అమ్మాయిలు ఇతన్ని నమ్మడం ప్రారంభించగానే.. నగ్నంగా ఉన్న ఫొటోలను వారితో షేర్ చేసుకునేవాడు. ఎక్కువగా కాలేజీ అమ్మాయిలనే టార్గెట్ చేసేవాడు. తన పేరు ప్రతీక్ష అని చెప్పుకొని పరిచయం చేసుకునేవాడు. ఇంటర్నెట్‌లో గుర్తు తెలియని మహిళల నగ్న వీడియోలను యువతులకు పంపేవాడు. వారు కూడా ఇతన్ని నమ్మి తమకు సంబంధించిన నగ్న చిత్రాలను పంపేవారు. ఇలా పంపగానే తన అసలు స్వరూపం బయటపెట్టేవాడు. డబ్బులు డిమాండ్ చేసి, ఇవ్వకుంటే నగ్న చిత్రాలను అందరికీ షేర్ చేస్తా.. అని బెదిరించేవాడు.

అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..


ఎక్కువ మొత్తం డిమాండ్ చేయకుండా.. కేవలం రూ.5నుంచి రూ.10వేల వరకు మాత్రమే అడిగేవాడు. తాను మోడల్ అని బెబుతూ.. ఆ రంగంలో ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు ఇప్పిస్తా అంటూ నమ్మబలికేవాడు. ప్రేమ వ్యవహారం, బ్లాక్‌మెయిలింగ్.. ఇదంతా రోజూ ఇంట్లో కూర్చునే చేసేవాడు. కానీ ఇంట్లో వారికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడేవాడు. అయితే ఇటీవల ఓ యువతిని కూడా ఇలాగే బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, యువకుడిని అరెస్ట్ చేశారు. ఈజీ మనీ కోసం అతడు చేసిన పని... స్థానికంగా సంచలనం కలిగించింది.

ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..

Updated Date - 2022-01-14T21:30:22+05:30 IST