Viral News: సెలవు రోజుల్లో ఉద్యోగిని డిస్టర్బ్ చేస్తే మామూలుగా ఉండదు.. రూ.1 లక్ష జరిమానా అంటూ కొత్త రూల్!

ABN , First Publish Date - 2022-12-31T19:35:51+05:30 IST

వారం అంతా ఎంతో కష్టపడి పని చేసే ఉద్యోగి సెలవు రోజున అయినా విశ్రాంతి తీసుకోవాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటాడు. అయితే ఆ రోజు కూడా ఉద్యోగికి ఫోన్ చేసి విసిగించే మేనేజర్‌లు, బాస్‌లు ఉంటారు. ఇంటి దగ్గర నుంచి కూడా పని చేయాలని ఒత్తిడి చేస్తారు

Viral News: సెలవు రోజుల్లో ఉద్యోగిని డిస్టర్బ్ చేస్తే మామూలుగా ఉండదు.. రూ.1 లక్ష జరిమానా అంటూ కొత్త రూల్!

వారం అంతా ఎంతో కష్టపడి పని చేసే ఉద్యోగి సెలవు రోజున అయినా విశ్రాంతి తీసుకోవాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటాడు. అయితే ఆ రోజు కూడా ఉద్యోగికి ఫోన్ చేసి విసిగించే మేనేజర్‌లు, బాస్‌లు ఉంటారు. ఇంటి దగ్గర నుంచి కూడా పని చేయాలని ఒత్తిడి చేస్తారు (Work on Holidays). అలాంటి మేనేజర్‌లకు చెక్ పెట్టేందుకు డ్రీమ్ 11 (Dream11) అనే కంపెనీ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. డ్రీమ్ 11 అనేది ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ కంపెనీ.

డ్రీమ్ 11 సంస్థ తన ఉద్యోగులకు ఉపయోగపడేలా ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. సెలవు రోజుల్లో ఉద్యోగులకు ఫోన్ చేసి పని చేయాలని ఒత్తిడి చేసే మేనేజర్లకు, సీనియర్లకు చెక్ పెట్టేందుకు రూ.1 లక్ష జరిమానా (Rs. 1 Lakh Fine) విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనకు కంపెనీ అన్‌ప్లగ్ పాలసీ అని పేరు పెట్టింది. సెలవు రోజుల్లో ఉద్యోగికి ఇకపై పనికి సంబంధించిన ఈ-మెయిల్, మెసేజ్, ఫోన్ కాల్ వంటివి రావని, సెలవుల్లో ఉద్యోగులు కంపెనీ నుంచి పూర్తిగా వేరు పడొచ్చని యాజమాన్యం పేర్కొంది.

Updated Date - 2022-12-31T19:35:54+05:30 IST