Viral Video: మాంసాన్ని టీవీలో చూసి.. ఈ శునకం ఏం చేసిందో మీరే చూడండి!
ABN , First Publish Date - 2022-06-26T22:36:01+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ శునకానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కొందరు కడుపుబ్బా నవ్వుకుంటుంటే.. మరికొందరేమో దాని అమాయకత్వాన్ని చూ

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ శునకానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కొందరు కడుపుబ్బా నవ్వుకుంటుంటే.. మరికొందరేమో దాని అమాయకత్వాన్ని చూసి జాలి పడుతున్నారు. కాగా.. నెటిజనం అంతలా రియాక్ట్ అయ్యేలా ఆ శునకం ఏం చేసింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో హస్కీ జాతికి శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఇటీవల అతడు టీవీ చూస్తూ ఓ వంటల ప్రోగ్రామ్ చూస్తుండగా.. అక్కడ ఉన్న శునకానికి టీవీలో మాంసం కనిపించింది. దీంతో అది వెంటనే టీవీ వద్దకు పరుగు తీసింది. అనంతరం మాంసం అనుకుని.. టీవీ స్క్రీన్‌ను నాకుతూ దాన్ని టేస్ట్ చేస్తున్నట్టు భావించింది. ఈ క్రమంలో సదరు యజమాని తన శునకం చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. శునకం పట్ల జాలిని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇప్పటి వరకు 9 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు.