డాక్టర్ల Prescription ఎందుకు ఎవరికీ అర్థం కాదు.. దీనిపై పరిశోధకలు ఏమంటున్నారంటే..!

ABN , First Publish Date - 2022-07-08T13:58:22+05:30 IST

డాక్టర్లు Prescriptionపై రాసిన పదాలను దాదాపు ఎవరూ అర్థం చేసుకోలేరు. కానీ మెడికల్ షాపులో పని చేసే వాళ్లు మాత్రం చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది దాన్ని కోడ్ లాంగ్వేజ్‌గా భావిస్తారు

డాక్టర్ల Prescription ఎందుకు ఎవరికీ అర్థం కాదు.. దీనిపై పరిశోధకలు ఏమంటున్నారంటే..!

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్లు Prescriptionపై రాసిన పదాలను దాదాపు ఎవరూ అర్థం చేసుకోలేరు. కానీ మెడికల్ షాపులో పని చేసే వాళ్లు మాత్రం చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది దాన్ని కోడ్ లాంగ్వేజ్‌గా భావిస్తారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. డాక్టర్లు Prescription‌ను అలా రాయడానికి పలు కారణాలు చెబుతున్నారు. కాగా.. ఆ కారణాలు ఏంటనే వివరాల్లోకి వెళితే..


వైద్యులు హాస్పిటల్‌లో ఉన్న సమయంలో వీలైనంత ఎక్కువ మంది పేషెంట్లను చూడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో వేగంగా Prescription రాయాల్సి ఉంటుంది. ఇలా వేగంగా Prescription‌ను రాయడం వల్ల ఆ పదాలు కాస్తా గజిబిజిగా మారి ఎవరికీ అర్థం కాకుండా పోతుందట.మరొక విషయం ఏంటంటే.. రోజూ వందలాది మందిని పేషెంట్లను చూడటం అందుకు తగ్గట్టు ప్రిస్క్రిప్షన్ రాసే క్రమంలో వాళ్ల చేతి వేళ్లు బాగా అలసిపోతాయట. క్రమంగా వారి చేతులు కూడా అదే దశకు చేరుకోవడంతో.. కొంత కాలానికి చేతి రాత పూర్తిగా మారిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ పేషంట్లను అర్థం కాకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రదేశాల్లో ఈ-ప్రిస్క్రిప్షన్‌లు అందుబాటులోకి వచ్చాయి. 


Read more