అత్తగారింట్లో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు యత్నం.. వారంతా కలిసి చేసిన పని.. అందరినీ షాక్‌కు గురి చేసింది..

ABN , First Publish Date - 2022-02-16T21:46:34+05:30 IST

హర్యానాలో ఇటీవల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్తగారింట్లో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. వారు చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

అత్తగారింట్లో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు యత్నం.. వారంతా కలిసి చేసిన పని.. అందరినీ షాక్‌కు గురి చేసింది..

పంతాలు, పట్టింపులు ఒక్కోసారి చాలా దూరం వెళ్తుంటాయి. పరువు పోయిందన్న కోపంతో సొంత పిల్లలను కూడా చంపేసిన సందర్భాలు చాలా చూశాం. అంతా జరిగాక పశ్చాత్తాప పడినా ప్రయోజనం ఉండదని చివరకు తెలుసుకుంటారు. హర్యానాలో ఇటీవల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్తగారింట్లో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. వారు చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


హర్యానాలోని మహేంద్రగడ్ జిల్లా బాలనకు చెందిన యువతికి, ఖాటోడ్‌కి చెందిన దీపక్‌ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. పెద్దలు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఇంట్లోని వారికి తెలీకుండా మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అటునుంచి అటే అత్తగారింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. తమ పరువు పోయిందని ఆగ్రహంతో ఉండేవారు. ఎలాగైనా తమ కూతురిని ఇంటికి తీసుకురావాలనుకున్నారు.

బోనులో సింహమే కదా.. ఏం చేస్తుందిలే అనుకుని తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి..


మహిళ తల్లిదండ్రులు, మరికొంతమంది వాహనాల్లో ఖాటోడ్‌కి వెళ్లారు. వెళ్లీవెళ్లగానే అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం యువతిని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులను కర్రలతో చితకబాదారు. ఎంత కొట్టినా వారు యువతిని వదలకపోవడంతో తుపాకీతో కాల్చారు. ఈ కాల్పుల్లో యువతి అత్త కాలికి గాయమైంది. తర్వాత వారు యువతిని తీసుకుని వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ ప్రాంతంలో యువతిని తీసుకువెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని రక్షించి అత్తింటికి పంపించారు. నిందితుల్లో కొంతమంది పోలీసుల అదుపులో ఉండగా.. మరికొంత మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఆ యువతి గొంతులో పచ్చి ఆకుల ఆనవాళ్లు.. అనారోగ్యంతోనే నవవధువు చనిపోయిందనుకున్నారు కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో..Read more