పైలట్ లేకుండానే ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. ఎందుకోసం వాడుతున్నారు, దీనికున్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-02-13T22:50:26+05:30 IST

నేల మీద ప్రయాణించే వాహనాలే కాదు.. ప్రస్తుతం హెలికాప్టర్‌ను కూడా పైలట్ లేకుండా నడిపించేస్తున్నారు. యూఎస్‌ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ డ్రైవర్ రహిత హెలీకాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు...

పైలట్ లేకుండానే ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. ఎందుకోసం వాడుతున్నారు, దీనికున్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

ఎడ్ల బండ్ల కాలం నుంచి అత్యాధునిక యంత్రాల వినియోగం వరకూ రానురానూ ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సైకిల్‌తో మొదలైన మానవుడి ప్రయాణం.. బైకు, బస్సు, కారు.. ఇలా ఎంతో ఆధునికతను సంతరించుకుంది. అంతటితో ఆగకుండా డ్రైవర్ అవసరం లేకుండా నడిచే వాహనాలను కూడా తయారు చేస్తున్నారు. నేల మీద ప్రయాణించే వాహనాలే కాదు.. ప్రస్తుతం హెలికాప్టర్‌ను కూడా పైలట్ లేకుండా నడిపించేస్తున్నారు. యూఎస్‌ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ డ్రైవర్ రహిత హెలీకాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెలికాప్టర్ గురించి మరింత తెలుసుకుందాం..


యూఎస్‌ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘అలియాస్‌’ అని పిలిచే ఈ హెలికాఫ్టర్‌ ట్రయల్‌ పరీక్షలను.. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్‌లో నిర్వహించారు. కంప్యూటర్ ఆపరేటెడ్‌ సిస్టమ్‌తో నడిచే ఈ హెలికాప్టర్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు 4వేల అడుగుల ఎత్తులో గంటకు  115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. వాతావరణం అనుకులించని సమయంలో కూడా సాఫీగా ప్రయాణించేలా దీన్ని రూపొందిస్తున్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించి.. సురక్షితంగా ల్యాండ్‌ అయింది. కాలం చెల్లిన మిలిటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల స్థానంలో ఈ అధునాతన అలియాస్ ఆటోమేటడ్‌ ఫైలెట్‌ రహిత హెలికాప్టర్లను ఏర్పాటు చేయనున్నారట.

బోనులో సింహమే కదా.. ఏం చేస్తుందిలే అనుకుని తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి..


అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ ఆధ్వర్యంలో ఈ హెలికాప్టర్‌ను సిద్ధం చేస్తున్నారు. భద్రత, ఎటువంటి భూభాగంలోకైనా దూసుకెళ్లడం, విపత్తులను నివారించడంతో పాటూ ప్రమాదంలో చిక్కుకున్న హెలికాప్టర్లకు సహాయకారిగా కూడా ఇది ఉపయోగపడనుంది. ఆర్మీకి సేవలు అందించడంలో ఈ హెలికాప్టర్ కీలక పాత్ర పోషించనుందని అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన వాతావరణంలోనూ ఇది సులభంగా ప్రయాణించగలదని తెలిపారు. దీని వినియోగం వల్ల ఖర్చు కూడా బాగా తగ్గుతుందని ఆయన చెబుతున్నారు.

పామును పట్టుకోవాలని చూసిన డేగ.. కొద్దిసేపు పోరాటం తర్వాత చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - 2022-02-13T22:50:26+05:30 IST

Read more