చాణక్య నీతి: ఇటువంటి వారికి సహాయం చేస్తే ఇబ్బందుల్లో పడతారు!
ABN , First Publish Date - 2022-04-20T13:14:37+05:30 IST
ఆచార్య చాణక్యుడు తన విధానాల ద్వారా...

ఆచార్య చాణక్యుడు తన విధానాల ద్వారా మన జీవితానికి సంబంధించిన పలు సమస్యలకు పరిష్కారాన్ని చూపాడు. చాణక్య నీతిలో ఆచార్య కౌటిల్య... కొంతమందికి సహాయం చేయకూడదని, అలా చేస్తే మనం ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. ఆచార్య చాణక్య తన అనుభవాలు, విషయపరి జ్ఞానం ఆధారంగా మూడు తరహాల వ్యక్తులను గుర్తించారు. వారు చాణక్య దృష్టిలో సహాయానికి అర్హులు కాదు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వ్యసనపరులు
మాదకద్రవ్యాల బానిసలైనవారికి సహాయం చేయకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడినవారికి విశ్వాసం ఉండదని చాణక్య నమ్ముతాడు. వారు డ్రగ్స్ కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అంతే కాదు మత్తులో ఉన్న వ్యక్తి తప్పు,ఒప్పులను గుర్తించలేడు. అందుకే అలాంటి వ్యసనపరులకు ఎప్పుడూ సహాయం చేయకూడదు. వారికి సేవ చేయడం లేదా డబ్బు ఇవ్వడం హాని చేస్తుందని హెచ్చరించాడు.
2. చెడు స్వభావం గల వ్యక్తి
చెడు స్వభావం కలిగిన వారిని మీరు గుర్తిస్తే వారికి దూరంగా ఉండటం మంచిది. అవగాహనతో అటువంటివారిని గుర్తించండి. అలాంటి వారికి మనం మంచి చేసినా, సహాయం చేసినా మనకే నష్టం కలుగుతుందని చాణక్య తెలిపారు. అలాంటి వారితో పరిచయం కలిగినవారికి సమాజం నుంచి, కుటుంబం నుంచి అవమానాలు ఎదురవుతాయి. అందుకే అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలి.
3. విచారంలో మునిగే వ్యక్తి
జీవితంలో దేనికీ తృప్తి చెందని, ఎప్పుడూ సంతోషంగా ఉండని వారికి దూరంగా ఉండాలని చాణక్య తెలిపాడు. ఇలాంటివారికి మేలు చేస్తే మనం బాధపడవలసి వస్తుంది. అలాంటి వారి జీవితం ఎంత బాగున్నా.. వారు ఎప్పుడూ అసంతృప్తితో ఉంటారు. ఇలాంటివారు ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడుతుంటారు. ఈ విధంగా అకారణంగా అసూయపడే వారికి, అసంతృప్తితో మెలిగేవారికి దూరంగా ఉండం మంచిదని ఆచార్య చాణక్య సూచించారు.