-
-
Home » Prathyekam » different holi celebration in nepal australia myanmar spl-MRGS-Prathyekam
-
మన దేశంలో హోలీ... ఇతర దేశాల్లో రంగుల కేళి ఎలా జరుగుతుందంటే..
ABN , First Publish Date - 2022-03-16T17:31:53+05:30 IST
దేశంలో హోలీకి సన్నాహాలు ముమ్మరం అయ్యాయి.

దేశంలో హోలీకి సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న పండుగ ఇది. ఈ రోజున జనమంతా ఒకరిపైమరొకరు రంగులు వేసుకోవడం ద్వారా పాత గొడవలను మరచిపోతారు. ఇటువంటి రంగుల వేడుక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా చాలా విభిన్నంగా జరుగుతుంది. ప్రపంచంలోఈ పండుగకు పేర్లు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ ప్రయోజనం ఒక్కటే. రంగులు పూయడం. ఆనందాన్ని పంచుకోవడం. హోలీ మాదిరిగానే మయన్మార్‌లో ఇటువంటి పండుగను జరుపుకుంటారు. దీనిని వాటర్ ఫెస్టివల్ లేదా మెకాంగ్ అని అంటారు. మయన్మార్‌లో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటారు.
ఈ పండుగ రోజున జనం ఒకరిపై ఒకరు రంగులు కురిపిస్తారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. చిన్చిల్లా మెలోన్ ఫెస్టివల్ ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు. ఇక్కడ రంగులకు బదులుగా పుచ్చకాయల రసం జల్లుకుంటారు. ఆరోజు చుట్టూ చూస్తే పుచ్చకాయల నదులు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొంటారు. ప్రజల ముఖాల్లో పండుగ ఆనందం కనిపిస్తుంది. నేపాల్‌లో లోలా పండుగను హోలీ లాగా జరుపుకుంటారు. లోలా అంటే బెలూన్. ఇక్కడ రంగుల బెలూన్‌లను ఒకరిపై ఒకరు విసరడం ఆనవాయితీ. స్పెయిన్ టొమాటినా ఫెస్టివల్ హోలీ వేడుకల కంటే తక్కువేమీ కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ పండుగలో పాల్గొనడానికి ఇక్కడకు చేరుకుంటారు. ఒకరిపై ఒకరు టమోటాలు విసురుకుంటూ ఆనందిస్తారు.