ఎక్స్‌ప్రెస్, మెయిల్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల మధ్య తేడాలివే...

ABN , First Publish Date - 2022-12-22T10:59:43+05:30 IST

మనదేశంలో ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి రైళ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని ప్రయాణానికి ఉత్తమ ఎంపికగా కూడా పరిగణిస్తారు.

ఎక్స్‌ప్రెస్, మెయిల్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల మధ్య తేడాలివే...

మనదేశంలో ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి రైళ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని ప్రయాణానికి ఉత్తమ ఎంపికగా కూడా పరిగణిస్తారు. రైలు ప్రయాణంలో భద్రతతో పాటు డబ్బు కూడా తక్కువగా ఖర్చు అవుతుంది. భారతీయ రైల్వేలు దేశానికి జీవనాధారగా కూడా పరిగణిస్తారు. ప్రతిరోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే ఎక్స్‌ప్రెస్, మెయిల్-ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైలు మధ్య తేడా ఏమిటో తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మెయిల్

వేగం ఆధారంగా భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఉన్నాయి. మెయిల్ అనేది ఎక్స్‌ప్రెస్ రైలు వేగం, సూపర్‌ఫాస్ట్ వేగం కంటే తక్కువగా ఉంటుంది. ఈ రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. వివిధ స్టేషన్లలో ఆగుతుంది. చాలా మెయిళ్ల నంబర్‌లు 123తో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు పంజాబ్ మెయిల్, ముంబై మెయిల్, కల్కా మెయిల్.

ఎక్స్‌ప్రెస్

ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశంలో పాక్షిక ప్రాధాన్యత కలిగిన రైలు సేవ. ఈ రైళ్ల వేగం గంటకు 55 కిలోమీటర్లు. అంటే ఎక్స్‌ప్రెస్ రైలు వేగం, మెయిల్-రైలు వేగం కంటే ఎక్కువ. సూపర్‌ఫాస్ట్ రైలు కంటే తక్కువ. ఎక్స్‌ప్రెస్ రైలు.. మెయిల్ రైలు మాదిరిగా వివిధ ప్రదేశాలలో హాల్ట్ అవదు. ఇందులో జనరల్, స్లీపర్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.

సూపర్ ఫాస్ట్

సూపర్‌ఫాస్ట్ రైలు వేగం మెయిల్, ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ. సూపర్ ఫాస్ట్ రైలు వేగం గంటకు 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఇవి తక్కువ స్టాపేజ్‌లను కలిగి ఉంటాయి. అధిక ఛార్జీలు ఉంటాయి. వీటిలో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయి.

Updated Date - 2022-12-22T10:59:44+05:30 IST