అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ డోర్ కొట్టిన కూతురు.. ఎంతకీ తీయకపోవడంతో వెనుక డోర్ నుంచి వెళ్లగా..
ABN , First Publish Date - 2022-03-17T00:24:04+05:30 IST
ఓ వ్యక్తి ఫామ్‌హౌస్‌కి కాపలాగా ఉంటూ.. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఇదిలావుండగా, గత మంగళవారం వీరి కుమార్తె.. తల్లిదండ్రులను కలిసి రావాలని..

కొన్నిసార్లు జరిగే అనూహ్య ఘటనలు.. కొందరిని అందలం ఎక్కిస్తే.. మరికొందరిని చివరకు అధఃపాతాలానికి తోసేస్తుంటాయి. నేర ఘటనలు జరిగే సమయంలోనూ అప్పుడప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు పెద్ద దిక్కూ దూరమై.. వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటూ ఉంటుంది. ఈ బాధ నుంచి కోలుకునేందుకు వారికి ఎంతో సమయం పట్టొచ్చు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటనలో కూడా ఇలాగే జరిగింది. అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ ఓ యువతి ఇంటి తలుపు కొట్టింది. అయితే ఎంతకీ తీయకపోవడంతో ఇంటి వెనుక వైపు డోర్ నుంచి లోపలికి వెళ్లగా షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లా సూరజ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సావ్జీ దోడియా (70), మన్ దోడియా దంపతులు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫామ్‌హౌస్‌కి కాపలాగా ఉంటూ.. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఇదిలావుండగా, గత మంగళవారం వీరి కుమార్తె.. తల్లిదండ్రులను కలిసి రావాలని ఫామ్‌హౌస్‌కి వెళ్లింది. అయితే ఆమె వెళ్లేసరికి తలుపులు మూసి ఉన్నాయి. అమ్మా! తలుపు తీయి.. అంటూ పిలిచింది. అయినా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తలుపులను గట్టిగా కొడుతూ, అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ గట్టిగా పిలిచింది. అప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో కూతురికి అనుమానం వచ్చింది.
బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి.. అంటూ స్నేహితులకు ఫోన్.. చివరకు ఇంటికి చేరుకున్న బాలిక ఇలా చెప్పడంతో..
ఇంటి వెనుక డోర్ తెరచి ఉండడంతో లోపలికి వెళ్లింది. లోపల తల్లిదండ్రులు ఇద్దరూ రక్తపు మడుగులో విగతజీవులుగా పడిఉండడంతో షాక్ అయింది. అమ్మా, నాన్నా.. అంటూ బోరున విలపించింది. తన సోదరుడికి విషయం తెలియజేయడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల పిల్లలను ఇద్దరినీ విచారించారు. తమ తండ్రి వద్ద ఉన్న రూ.15వేలతో పాటూ తల్లి ఆభరణాలు కూడా కనిపించలేదని చెప్పారు. దీంతో నగదు, నగల కోసం గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.