-
-
Home » Prathyekam » Daughter in law bites aunts fingers after turning off TV in Maharashtra kjr spl-MRGS-Prathyekam
-
పదే పదే అదే మాట అంటుండడంతో ఆగ్రహించిన కోడలు.. అత్త వేళ్లను కొరికేయడమే కాకుండా భర్త అని కూడా చూడకుండా..
ABN , First Publish Date - 2022-09-08T23:46:28+05:30 IST
కోడళ్లను వేధించే అత్తలు ఉన్నట్లే.. అత్తలను చిత్రహింసలు పెట్టే కోడళ్లు కూడా ఉంటారు. అత్తాకోడళ్ల మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు..

కోడళ్లను వేధించే అత్తలు ఉన్నట్లే.. అత్తలను చిత్రహింసలు పెట్టే కోడళ్లు కూడా ఉంటారు. అత్తాకోడళ్ల మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడూ అవి చాలా సీరియస్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒకరిపై ఇంకొకరు దాడులు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇంత చిన్న సమస్యకు అంత గొడవ అవసరమా.. అని అంతా చర్చించుకోవడం కూడా చూస్తుంటాం. తాజాగా, మహారాష్ట్రలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పదే పదే అదే మాట అంటుండడంతో కోడలికి తీవ్రమైన కోపం వచ్చింది. అత్త వేళ్లను కొరికేయడమే కాకుండా భర్త అని కూడా చూడకుండా.. చివరకు రచ్చ రచ్చ చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని (Maharashtra) థాణె జిల్లా అంబర్నాథ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ అనే మహిళ సోమవారం ఇంట్లో టీవీ చూస్తూ ఉంది. అదే సమయంలో ఆమె అత్త వృశాలీ కులకర్ణి.. పూజ చేసుకుంటూ ఉంది. టీవీ సౌండ్ ఎక్కువగా ఉండడంతో పూజ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని, సౌండ్ తగ్గించమని అత్త తెలిపింది. అయితే ఆమె మాట ఏమాత్రం పట్టించుకోని కోడలు.. సౌండ్‌ను మరింత పెంచింది. దీంతో ఆగ్రహానికి గురైన అత్త.. అక్కడకు వచ్చి టీవీ ఆఫ్ చేసింది. ఈ విషయంలో అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Sad incident: స్టేజిపై డాన్స్ చేస్తున్న పార్వతి వేషధారి... అంతా చూస్తుండగా సడన్‌గా ఊహించని ఘటనతో..
టీవీ ఆన్ చేసేదే లేదంటూ అత్త పదే పదే అంటుండడంతో కోడలికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఆమె చేతి వేళ్లను గట్టిగా కొరికేసింది. వీరి గొడవను గమనించిన భర్త.. అక్కడకు వచ్చి భార్యకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో భర్తను కూడా చితకొట్టేసింది. గమనించిన స్థానికులు కోడలికి నచ్చజెప్పి.. గాయపడిన అత్తను ఆస్పత్రికి తరలించారు. మూడు వేళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా చిన్న చిన్న విషయాలపై అత్తాకోడళ్లు తరచూ గొడవపడుతున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.