Boy Beaten To Death: దారుణం.. నా కుండలో నీళ్లే తాగుతావా? అంటూ దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్!
ABN , First Publish Date - 2022-08-14T19:50:19+05:30 IST
భారతదేశం సగర్వంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్‌లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది.

భారతదేశం సగర్వంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్‌లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. స్వపరిపాలన సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్నా సమాజంలో ఇంకా అంటరానితనం తొలిగిపోలేదు. తాజాగా ఓ దళిత బాలుడి పట్ల ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. తన కోసం ఉంచిన నీరు తాగాడనే కారణంతో దళిత విద్యార్థిని (Dalit student beaten to death) చావబాదాడు. ఈ ఘటన జులై 20న జరిగింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలుడు (9) శనివారం మృతిచెందాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని వెలుగు చూసింది.
Wedding kits in Odisha: నూతన దంపతులకు వెడ్డింగ్ కిట్లు.. కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు!
రాజస్థాన్ (Rajasthan)లోని జలోర్ జిల్లా సైలా గ్రామంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో మేఘవాల్ (9) అనే దళిత బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. గత నెల 20వ తేదీన మేఘవాల్ స్కూల్‌కి వెళ్లాడు. బాగా దాహం వేయడంతో క్లాస్‌లో టీచర్ కోసం ఉంచిన కుండలోని నీళ్లు తాగాడు. మేఘవాల్ నీరు తాగడాన్ని చూసిన ఉపాధ్యాయుడు చైల్ సింగ్ (40) ఆగ్రహంతో ఊగిపోయి ఆ బాలుడిని కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడి కంటికి, చెవికి తీవ్రగాయాలయ్యాయి. చెవిలోని కర్ణభేరి పగలిపోయింది.
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఉదయ్‌పూర్ తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి ఎస్సీ-ఎస్టీ చట్టం కింద హత్యా కేసు నమోదు చేశారు.