కూతుర్ని డాక్టర్‌ను చెయ్.. ఆర్మీకి మాత్రం పంపకు.. అంటూ భార్యకు చివరి వీడియో.. ఓ సైనికుడి ఆత్మహత్య కేసులో..

ABN , First Publish Date - 2022-07-14T22:13:23+05:30 IST

రాజస్థాన్‌ జోధ్‌పూర్ జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో కానిస్టేబుల్ నరేష్ జాట్ ఆత్మహత్య కేసులో నాలుగు రోజుల తర్వాత పోలీసులు ఎట్టకేలకు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో...

కూతుర్ని డాక్టర్‌ను చెయ్.. ఆర్మీకి మాత్రం పంపకు.. అంటూ భార్యకు చివరి వీడియో.. ఓ సైనికుడి ఆత్మహత్య కేసులో..

రాజస్థాన్‌ జోధ్‌పూర్ జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో కానిస్టేబుల్ నరేష్ జాట్ ఆత్మహత్య కేసులో నాలుగు రోజుల తర్వాత పోలీసులు ఎట్టకేలకు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో డీఐజీ భూపేంద్ర సింగ్ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ మృతదేహాన్ని తరలించమని.. కుటుంబ సభ్యులు నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇచ్చారు. ఇదిలావుండగా, నరేష్ జాట్ ఆత్మహత్య చేసుకునే ముందు చెప్పిన మాటలను ఆయన భార్య, కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. కూతుర్ని డాక్టర్‌ను చెయ్, ఆర్మీకి మాత్రం పంపకు అని భార్యకు చివరి వీడియో పంపాడు. వివరాల్లోకి వెళితే..


సీఆర్పీఎఫ్ జవాన్ నరేష్ జాట్‌.. ట్రైనింగ్ సెంటర్‌లో జూలై 11న తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య ఊర్మిళ, ఆరేళ్ల కుమార్తె కనీషా ఉన్నారు. చనిపోయే ముందు రోజు భార్య, కుమార్తెను తన గదిలోనే ఉంచుకున్నాడు. సుమారు 18గంటల పాటు వారిని గదిలోనే ఉంచాడు. ఆ సమయంలో భర్త తనతో పలు విషయాలను తెలియజేశారని మృతుడి భార్య చెబుతోంది. తనకు ఐదు రోజులుగా డ్యూటీ కేటాయించలేదని, దీనికితోడు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పినట్లు తెలిపింది. ఆదివారం రాత్రంతా తాము అదే బాధలో ఉన్నామని చెప్పింది. కూతురు పెద్దయ్యాక.. డాక్టర్‌ను చేయ్, ఆర్మీకి మాత్రం పంపొద్దని వీడియో తీస్తూ.. పదే పదే గుర్తు చేసినట్లు ఊర్మిళ తెలిపింది. ఇప్పటికీ తమ కుమార్తె.. తండ్రి డ్యూటీ నుంచి వస్తారనే భ్రమలోనే ఉందని చెబుతూ కన్నీటిపర్యంతమైంది. భార్యతో మాట్లాడిన కొన్ని నిముషాల వ్యవధిలోనే నరేష్ జాట్‌.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

robbery: సంచి నిండా cash ఉందనుకుని.. బెదిరించి మరీ లాక్కెళ్లారు.. బాధితుడు చెప్పింది విని అవాక్కయిన పోలీసులు..


మరోవైపు నరేష్ తండ్రి లక్ష్మీరామ్.. మూడు రోజులుగా జోధ్‌పూర్‌లో మృతదేహంతో ధర్నా చేస్తున్నాడు. వీరికి పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఆందోళన రోజురోజుకూ ఎక్కువవడంతో ఉన్నతాధికారులు స్పందించి, డీఐజీ భూపేంద్ర సింగ్ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నరేష్ జాట్ భార్యకు పింఛన్ అందజేయడంతో పాటూ పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించాలన్నారు. అదేవిధంగా నరేష్‌ జాట్‌ కుమార్తెకు ఉచిత విద్యను అందించడంతో పాటూ పెద్దయ్యాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, నరేష్ జాట్‌ను కర్వాడ్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో నియమించడం గమనార్హం.

రాత్రి వేళ యువతి ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గదిలోకి వెళ్లి చూడగా..

Updated Date - 2022-07-14T22:13:23+05:30 IST