పెళ్ళినాటి ప్రమాణాలలో పిజ్జాకూ చోటు.. ఈ దంపతుల డిమాండ్స్ తెలిసి పిజ్జా హట్ ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2022-10-17T17:36:26+05:30 IST

శాంతి, మింటూ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

పెళ్ళినాటి ప్రమాణాలలో పిజ్జాకూ చోటు.. ఈ దంపతుల డిమాండ్స్ తెలిసి పిజ్జా హట్ ఏం చేసిందంటే...


పెళ్ళిలో పురోహితుడు ప్రమాణాలు చేయిస్తారు భార్యాభర్తలతో. పెళ్ళికి ముందు తమ తమ డిమాండ్స్ ఏమైనా ఉంటే కాబోయే దంపతులు ముందుగానే మాట్లాడుకుని వాటికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. అస్సాం కు చెందిన భార్యా భర్తల విషయంలో ఇలాంటి ఒప్పందమే జరిగింది. అసలు విషయంలోకి వెళితే...... 


శాంతి ప్రసాద్ అనే అమ్మాయి, మింటూ రాయ్ అనే అబ్బాయి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శాంతికి పిజ్జా అంటే చెప్పలేనంత పిచ్చి. వారు పరిచయమైన కొత్తలో ఇద్దరూ బయట కలుసుకునేవారు. అప్పుడు శాంతి పిజ్జా తినడానికే ఆసక్తి చూపించేది. అయితే ఆమె కోసం మొదట్లో పిజ్జా తిన్నా, ప్రతిసారి అదే తినాలంటే మింటూకు విసుగొచ్చేసింది. అదే విషయాన్ని తన స్నేహితుల దగ్గర ఫిర్యాదు చేశాడు. వారందరూ కలసి వీరి ఇష్టాఇష్టాలను అన్నిటిని పరిగణలోకి తీసుకుని కొన్ని ఒప్పందాలు రాసిపెట్టారు. వీటిలో నెలకు ఒకసారి మాత్రమే పిజ్జా తినాలనే కండిషన్ కూడా ఉంది. శాంతి, మింటూ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయం ఒక రేంజ్‌లో వైరల్ అయ్యింది కూడా. 




వీరిద్దరి పెళ్ళి గురించి పిజ్జా డిమాండ్ గురించి తెలుసుకున్న పిజ్జా హట్ ఈ దంపదులకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం నెలకు ఒకసారి పిజ్జా తినాలనుకున్న ఈ దంపతులకు.. తమ ఔట్‌లెట్‌లో నెలకు ఒకసారి ఉచితంగా పిజ్జా తినే అవకాశాన్ని కల్పించింది. ఇలా సంవత్సరం పాటు ఆ భార్యభర్తలకు ఉచిత పిజ్డా అందించనున్నట్టు తెలిపింది. పెళ్ళివాటి ప్రమణాలలో పిజ్జాకూ చోటివ్వడమే విచిత్రమైతే పిజ్జా హట్ ప్రతినిధులు దంపతుల కోరిక తీర్చడానికి ఏడాదిపాటు పాటు ఫ్రీగా పిజ్జాను ఆఫర్ చేయడం అంతకంటే విచిత్రం. 


కేవలం పిజ్జా మాత్రమే కాకుండా ఇద్దరూ కలసి రోజు జిమ్‌కు వెళ్ళడం, 15 రోజులకు ఒకసారి షాపింగ్‌కు వెళ్ళడం వంటి మరికొన్ని కండిషన్లు కూడా వీళ్ల ఒప్పందం‌లో ఉన్నాయి. ఏది ఏమైనా దంపతుల విచిత్ర ఒప్పందం.. పిజ్జా హట్ వాళ్లకు ఫ్రీగా పిజ్జాను ఆఫర్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - 2022-10-17T17:36:26+05:30 IST