ఎంతో ఇష్టపడి ఇల్లు కొనుగోలు చేశారు.. ఉన్నట్టుండి ఖాళీ చేసి బస్‌లో జీవితం.. కారణమేంటని అడిగితే..

ABN , First Publish Date - 2022-03-06T02:18:56+05:30 IST

చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించాలని భావిస్తారు. ఆ డబ్బులతో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసి.. హుందాగా బతకాలని ఇష్టపడాతారు. కానీ అమెరికాకు చెందిన భా

ఎంతో ఇష్టపడి ఇల్లు కొనుగోలు చేశారు.. ఉన్నట్టుండి ఖాళీ చేసి బస్‌లో జీవితం.. కారణమేంటని అడిగితే..

ఇంటర్నెట్ డెస్క్: చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించాలని భావిస్తారు. ఆ డబ్బులతో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసి.. హుందాగా బతకాలని ఇష్టపడాతారు. కానీ అమెరికాకు చెందిన భార్యభర్తలు మాత్రం ముచ్చటపడి కొనుకున్న ఇంటిని వదిలి.. కొన్ని రోజులుగా స్కూల్‌ బస్‌లో జీవితం గడుపుతున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కేటీ, సామ్ ఇద్దరూ కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నందున జీవితాన్ని లగ్జరీగా గడపాలని తొలుత భావించారు. ఈ క్రమంలోనే పొదుపు చేసుకున్న మొత్తంతో ఓ అపార్ట్‌మెంట్‌లో 3బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ముచ్చటపడి కొనుగోలు చేసిన ఇంటిని ఖాళీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఓ స్కూల్ బస్‌ను కొనుగోలు చేశారు. అనంతరం ఏడాదిపాటు శ్రమించి.. బస్సులోనే నివసేంచేందుకు వీలుగా దాన్ని మార్చుకున్నారు. 2021లో ఇంటిని వీడి.. ఆ బస్సులోనే జీవితం గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడుతూ.. బస్సులో నివసించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమకు ప్రయాణం అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. అంతేకాకుండా.. ఇంటిగా మార్చుకున్న బస్సులో ప్రయాణిస్తూనే అమెరికాలోని అనేక ప్రాంతాలను చుట్టేసినట్టు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఆ దంపతులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Updated Date - 2022-03-06T02:18:56+05:30 IST