ఆలయం వద్ద నదీ స్నానం చేస్తూ.. దంపతుల రాసలీలలు.. విసిగిపోయిన భక్తులంతా కలిసి చివరకు..

ABN , First Publish Date - 2022-06-24T02:09:32+05:30 IST

కొందరు ప్రేమికులు సమయం, సందర్భం, స్థలం.. ఇవేవీ పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో రాసలీలలు సాగిస్తుంటారు. పక్కన వారు చూస్తే ఎమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా..

ఆలయం వద్ద నదీ స్నానం చేస్తూ.. దంపతుల రాసలీలలు.. విసిగిపోయిన భక్తులంతా కలిసి చివరకు..

కొందరు ప్రేమికులు సమయం, సందర్భం, స్థలం.. ఇవేవీ పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో రాసలీలలు సాగిస్తుంటారు. పక్కన వారు చూస్తే ఎమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో దంపతులు చేసిన నిర్వాకం.. చివరకు పెద్ద వివాదానికి దారి తీసింది. ఎంత దంపతులైతే మాత్రం.. ఆలయం వద్ద నదీ స్నానం చేస్తూ, ఏంటీ  పాడు పనులు.. అంటూ భక్తులంతా కలిసి భర్తను ఏం చేశారంటే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాముడి జన్మస్థలమైన అయోధ్యను హిందువులంతా పవిత్రంగా భావిస్తారు. స్థానికంగా ఉన్న ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అక్కడే ఉన్న సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, పూజలు చేస్తుంటారు. నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇదిలావుండగా, ఇటీవల ఆలయానికి వచ్చిన దంపతులు నదిలో స్నానం చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. స్నానం చేసే క్రమంలో భక్తులందరి మధ్య భార్యను కౌగిలించుకుని, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికే వారి చేష్టలకు విసిగిపోయిన భక్తులు.. చివరికి కోపంతో భర్తను లాక్కుని బయటికి తీసుకెళ్తారు.

పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం.. భార్య నిద్రపోయాక భర్త బలవన్మరణం..!


ఆలయం వద్ద అందరి ముందు ఇలాంటి అపవిత్ర పనులు చేస్తావా... అంటూ అతడిపై పిడి గుద్దులు కురిపించారు. దీంతో భర్తను కాపాడేందుకు భార్య.. శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా భక్తులు మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఆలయ అధికారుల వరకూ చేరడంతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటన రామ్‌కీపౌడి ఘాట్‌లో మంగళవారం జరిగిందని స్థానికులు చెబుతున్నా.. ఖచ్చితమైన సమాచారం ఇంకా అందలేదని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టి మరీ 27 ఏళ్ల యువతి దారుణమిది..!

Updated Date - 2022-06-24T02:09:32+05:30 IST