అతడికి వధువును వెతకలేకపోయిందని.. మ్యారేజ్ బ్యూరోకు షాకిచ్చిన Consumer Court!

ABN , First Publish Date - 2022-07-07T22:13:20+05:30 IST

మ్యారేజ్ బ్యూరోకు Consumer Court షాకిచ్చిన న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇలా అయితే.. ఇక మ్యారేజ్ బ్యూరోలు మూసుకోవాల్సిందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కా

అతడికి వధువును వెతకలేకపోయిందని.. మ్యారేజ్ బ్యూరోకు షాకిచ్చిన Consumer Court!

ఇంటర్నెట్ డెస్క్: మ్యారేజ్ బ్యూరోకు Consumer Court షాకిచ్చిన న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇలా అయితే.. ఇక మ్యారేజ్ బ్యూరోలు మూసుకోవాల్సిందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటినే వివరాల్లోకి వెళితే.. 


ఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు పెళ్లి సంబంధాలను చూసేవారు. కానీ కాలం మారడంతో.. ప్రస్తుతం ఆ పనిని మ్యారేజ్ బ్యూరోలు చేస్తున్నాయి. అంతేకాకుండా రకరకాల ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకుంటూ తమ వద్దకు రప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌కు చెందిన శంకర్‌లాల్ అనే వ్యక్తి తన కుమారుడికి కోసం స్థానికంగా ఉన్న ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. తన కుమారుడి వివరాలు చెప్పి, మంచి అమ్మాయిని చూడాల్సిందిగా పేర్కొన్నాడు. అందుకు ఫీజుగా లక్ష రూపాయలను చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.ఈ క్రమంలో కొద్ది రోజుల తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి అతడికి ఫోన్ వచ్చింది. మ్యారేజ్ బ్యూరోకు రావాల్సిందిగా పేర్కొనడంతో శంకర్‌లాల్ తన కుమారుడితో సహా అక్కడికి వెళ్లాడు. అక్కడ వాళ్లు చూపించిన అమ్మాయి ఫొటోను చూసి ఓకే చెప్పేశారు. ఆమె గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సిందిగా అక్కడి సిబ్బందికి చెప్పి ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ కార్యాలయం నుంచి అతడికి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయికి ఇది వరకే పెళ్లైపోయిందని.. మరో సంబంధం ఉందని చెప్పడంతో మరోసారి కొడుకుతో సహా అతడు మ్యారేజ్ బ్యూరోకి వెళ్లాడు. కార్యాలయం మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. తండ్రికొడుకులు ఆ అమ్మాయిని నచ్చడం.. ఆమె గురించిన మరింత సమాచారం అడిగి ఇంటికి రావడం చకచకా జరిగిపోయింది. అయితే.. అలా చెప్పి వచ్చిన తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి శంకర్‌లాల్‌కు ఎటువంటి ఫోన్ రాలేదు. ఈ క్రమంలో ఏడాది గడిచిపోయింది. దీంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యారేజ్ బ్యూరోకు వ్యతిరేకంగా Consumer Courtను ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సదరు మ్యారేజ్ బ్యూరోకి షాకిచ్చింది. ఫీజు కింద తీసుకున్న లక్ష రూపాయలను శంకర్‌లాల్‌కు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా రూ.5వేల జరిమానా కూడా విధించింది. కాగా.. కోర్టు తీర్పు స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 


Read more