కుక్కపిల్లలకు నాగుపాము కాపలా

ABN , First Publish Date - 2022-12-13T08:59:56+05:30 IST

కడలూరు జిల్లాలో కుక్కపిల్లకు రక్షణగా ఉంటూ, తల్లి కుక్కను కూడా దగ్గరకు రానివ్వని సర్పాన్ని అగ్నిమాపక సిబ్బంది బంధించారు. పందలూరు ప్రాంతానికి చెందిన సంపత్‌ కొత్త

కుక్కపిల్లలకు నాగుపాము కాపలా

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 12: కడలూరు జిల్లాలో కుక్కపిల్లకు రక్షణగా ఉంటూ, తల్లి కుక్కను కూడా దగ్గరకు రానివ్వని సర్పాన్ని అగ్నిమాపక సిబ్బంది బంధించారు. పందలూరు ప్రాంతానికి చెందిన సంపత్‌ కొత్త ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వాడు ఓ గుంతలో ఓ కుక్క పిల్లలు పెట్టింది. ఈ నేపథ్యంలో, తల్లి కుక్క బయటకు వచ్చిన సమయంలో ఓ నాగు పాము ఆ పిల్లల పక్కన చేరింది. కొంత సమయం తర్వాత తల్లి కుక్క అక్కడకు వచ్చినా పిల్లల దగ్గరకు రాకుండా పాము బుసలు కొడుతోంది. గమనించిన చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నా పాము కదల్లేదు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న కడలూరు అగ్నిమాపక సిబ్బంది పామును బంధించి సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు.

Updated Date - 2022-12-13T09:00:29+05:30 IST