-
-
Home » Prathyekam » Class 2 Boy Suffers 40 Burns After Teacher Throws Hot Water at Him in Karnataka prvn spl-MRGS-Prathyekam
-
Viral News: విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు.. మలవిసర్జన చేశాడని 2వ తరగతి విద్యార్థిపై మరుగుతున్న నీటిని..
ABN , First Publish Date - 2022-09-10T13:37:29+05:30 IST
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. విచక్షణ కోల్పోయాడు. చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా ఎనిమిదేళ్ల బాలుడిపట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఒంటిపై వేడి నీళ్లు పోసి, పైశాచిక ఆనందాన్ని పొందాడు. అతడు అంతటితో ఊరుకోలేదు. విషయం బ

ఇంటర్నెట్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. విచక్షణ కోల్పోయాడు. చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా ఎనిమిదేళ్ల బాలుడిపట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఒంటిపై వేడి నీళ్లు పోసి, పైశాచిక ఆనందాన్ని పొందాడు. అతడు అంతటితో ఊరుకోలేదు. విషయం బయటికి రాకూడనే ఉద్దేశంతో విద్యార్థి తల్లిదండ్రులపైనా ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక(Karnataka)లోని రాయ్‌చూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. రాయ్‌చూర్ జిల్లాలోని సంతేకల్లూర్ గ్రామంలో ఘనమఠేశ్వర అనే గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో హులిగెప్ప అనే వ్యక్తి ఉపాధ్యాయుడి(Teacher)గా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న అఖిత్ అనే విద్యార్థి.. యూనిఫాంలో మలవిసర్జన చేశాడనే కారణంతో హులిగెప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే నిఖిత్ ఒంటిపై వేడి నీళ్లు(Throws Hot Water) పోశాడు. 40శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న నిఖిత్.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విద్యార్థికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్(Viral in Social Media) కాగా.. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదనే కారణంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇదిలా ఉంటే.. నిఖిత్‌పై వేడి నీళ్లు పోసిన ఘటన బయటకు రాకూడదనే ఉద్దేశంతో.. హులిగెప్ప తన పలుకుబడిని ఉపయోగించినట్టు తెలుస్తోంది. స్థానిక లీడర్లతో తనకు ఉన్న పరిచయాన్ని వాడుకొని.. నిఖిత్ తల్లిదండ్రులను బెదిరించినట్టు సమాచారం.