Viral video: కొడుకు ప్రోగ్రస్ కార్డు చూసి గుక్కపెట్టి ఏడ్చిన తండ్రి.. ఏడాది పాటు ట్యూషన్ పెట్టిస్తే ఆ కుర్రాడికి వచ్చిన మార్కులు ఎన్నంటే..
ABN , First Publish Date - 2022-07-06T20:35:29+05:30 IST
పిల్లల చదువు గురించి తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. తమ పిల్లలు చదువులో ముందుండాలని అందరూ కోరుకుంటారు..

పిల్లల చదువు గురించి తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. తమ పిల్లలు చదువులో ముందుండాలని అందరూ కోరుకుంటారు.. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్‌లో వెనుకబడితే ప్రత్యేకంగా ట్యూషన్ కూడా పెట్టిస్తారు.. నిరంతరం పిల్లల చదువు గురించే ఆలోచిస్తుంటారు.. అంత చేసినా పిల్లలు సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు.. చైనాకు చెందిన ఓ వ్యక్తి తాజాగా తన కొడుకు ప్రోగ్రస్ రిపోర్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చైనాకు చెందిన ఒక వ్యక్తి తన కొడుకు క్లాస్‌లో టాప్ రావాలని కలలు కన్నాడు. తన కొడుకు గణితంలో చాలా వీక్ కావడంతో సంవత్సరం పాటు ప్రత్యేకంగా ట్యూషన్ కూడా పెట్టించాడు. అంత చేసినా తన కొడుకు Mathematicsలో సాధించిన స్కోర్ చూసి ఆ తండ్రి గుక్కపెట్టి ఏడ్చాడు. ఎందుకంటే అతని కొడుక్కి గణితంలో నూటికి కేవలం 6 మార్కులే వచ్చాయి. అది చూసిన తండ్రి షాక్‌తో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.