Viral Video: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ.. నెటిజన్ల ఫిదా!

ABN , First Publish Date - 2022-06-19T18:09:05+05:30 IST

ప్రస్తుతం పలు రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

Viral Video: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ.. నెటిజన్ల ఫిదా!

ప్రస్తుతం పలు రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఆసక్తికర వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చింపాంజీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చింపాంజీ.. చేపలకు ఆహారం వేస్తోంది. ఆ చింపాంజీ అచ్చం మనిషిలాగానే ప్రవర్తించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 


ఒక పార్కులో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లిన చింపాంజీ ప్లేట్‌లో ఉన్న ధాన్యాలను తీసుకుని చేపలకు ఆహారంగా వేస్తోంది. ఆ చింపాంజీ వేసిన ధాన్యం మొత్తాన్ని చేపలు వెంటనే తినేశాయి. ఈ వైరల్ వీడియో ఇప్పటికే 12 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. 61 వేల మంది దీనిని లైక్ చేశారు. చాలా కూల్‌గా, అచ్చం మనిషిలా ప్రవర్తిస్తున్న చింపాంజీ తీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. 

Updated Date - 2022-06-19T18:09:05+05:30 IST