చాణక్యనీతి: ఇటువంటివారి చేతులు పడితే మట్టి కూడా బంగారమే!

ABN , First Publish Date - 2022-04-19T13:06:46+05:30 IST

గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త అయిన...

చాణక్యనీతి: ఇటువంటివారి చేతులు పడితే మట్టి కూడా బంగారమే!

గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త అయిన ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతి... మనిషి విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని ఎలా పొందాలో చెబుతుంది. మనిషి ఎలా ధనవంతుడు కావాలో కూడా దీనిలో వివరించారు. డబ్బును కాపాడుకునేందుకు సంబంధించిన కొన్ని విషయాల గురించి కూడా తెలిపారు. చాణక్య నీతిలో తెలిపిన ఈ విషయాలు మనిషి తన జీవితంలో అమలు చేస్తే. ఆ వ్యక్తి ఎప్పుడూ ఇబ్బందుల్లో పడడు. మనిషి ఎల్లప్పుడూ ధనవంతునిగా ఉండే ఉపాయాన్ని తెలిపిన చాణక్య నీతిలోని పలు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


వీటిని ఆచరించే వ్యక్తికి గౌరవం కూడా లభిస్తుంది. ఇటువంటివారు మట్టిని ముట్టుకున్నా అది బంగారంలా మారుతుంది.  అంటే ఆ మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడని అర్థం. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఇతరుల విషయంలో ఎప్పుడూ మంచి భావాలను కలిగినవారు, ఇతరులకు సహాయం చేయాలనే భావం కలిగినవారు జీవితంలోని అన్ని కష్టాలను సులభంగా ఎదుర్కొంటారు. అలాంటివారికి డబ్బు సంపాదనకు కొరత ఉండదు. జీవితంలోని ప్రతి ఆనందాన్ని అనుభవిస్తారు. దానధర్మాలలో నిమగ్నమైనవారు సమాజం విషయంలో తమ బాధ్యతను ప్రదర్శిస్తారు. అవసరమైన వారికి సహాయం అందిస్తారు. వారికి అదృష్టం కలసివస్తుంటుంది. ఇలాంటి వారు ఏ పని చేసినా, వ్యాపారం చేసినా విజయం సాధిస్తారు. సమాజంలో ఎంతో గౌరవం కూడా పొందుతారు. ఇటువంటివారు తమ డబ్బును దానధర్మాలకు వినియోగిస్తారు. వీరి జీవితంలో కష్టాలు రావు, వచ్చినా వాటిని వారు తేలిగ్గా అధిగమిస్తారు. ఇటువంటివారి వంశం అభివృద్ధి చెందుతుంటుంది. 

Updated Date - 2022-04-19T13:06:46+05:30 IST