chanakya niti: అలాంటి పురుషులను మహిళలు అమితంగా ఇష్టపడతారు!

ABN , First Publish Date - 2022-12-31T09:46:27+05:30 IST

గొప్ప పండితుడు, నీతి ప్రవచనకర్త, దౌత్యవేత్త, ఉపాధ్యాయుడు, వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన విధానాలలో స్త్రీ, పురుషులకు సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించారు.

chanakya niti: అలాంటి పురుషులను మహిళలు అమితంగా ఇష్టపడతారు!

గొప్ప పండితుడు, నీతి ప్రవచనకర్త, దౌత్యవేత్త, ఉపాధ్యాయుడు, వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన విధానాలలో స్త్రీ, పురుషులకు సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించారు. చాణక్య నీతిలో పురుషులలోని అనేక లక్షణాలు, మంచి లక్షణాల గురించి కూడా తెలిపారు. అలాగే పురుషులలో స్త్రీలు ఇష్టపడే లక్షణాలను కూడా తెలియజేశారు. చాణక్య నీతి ప్రకారం ఈ 3 లక్షణాలను కలిగిన పురుషులను మహిళలు అమితంగా ఇష్టపడతారు. అలాంటి పురుషులు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. పురుషులలో స్త్రీలు ఇష్టపడే సుగుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజాయితీ

నిజాయితీపరులను అందరూ ఇష్టపడతారు. అయితే చాణక్య నీతి ప్రకారం నిజాయితీ కలిగిన పురుషులు స్త్రీలకు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇతరులతో సంబంధాలు కలిగివుండటంలో నిజాయితీగా ఉంటూ, ఎవరినీ మోసం చేయని పురుషులను తమ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని స్త్రీలు కోరుకుంటారని ఆచార్య చాణక్య చెప్పారు.

స్త్రీల పట్ల సత్ప్రవర్తన

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం స్త్రీలు ఎల్లప్పుడూ మహిళల పట్ల సత్ప్రవర్తతో మెలిగేవారిని ఇష్టపడతారు. స్త్రీలను గౌరవిస్తూ, ప్రేమగా, మర్యాదగా, మాట్లాడే పురుషులను మహిళలు ఎంతో ఇష్టపడతారు. స్త్రీలు అలాంటి పురుషులను తమ భాగస్వాములుగా చేసుకోవాలని కోరుకుంటారని చాణక్య నీతిలో తెలియజేశారు.

మహిళల మాట వినేవారు

పురుషులు ఎల్లప్పుడూ తమ అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ స్త్రీల అభిప్రాయాలను విస్మరిస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం స్త్రీలు అలాంటి పురుషులను అస్సలు ఇష్టపడరు. చాణక్య నీతిలో చెప్పినదాని ప్రకారం స్త్రీలు తమ అభిప్రాయానికి విలువనిస్తూ, తమకు తగిన గౌరవం ఇచ్చేవారిని ఇష్టపడతారు.

Updated Date - 2022-12-31T09:46:29+05:30 IST