Viral Video: ఆ పిల్లి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా.. దాహం వేసినపుడు కూలర్ దగ్గరకు వెళ్లి ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2022-08-14T01:32:03+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు బాగా ఆదరణ పొందుతున్నాయి. తాజాగా పిల్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో Buitengebieden అనే ట్విటర్ హ్యాండిల్‌పై షేర్ అయింది.
ఆ వీడియోలో ఓ పిల్లి నేరుగా కూలర్ దగ్గరకు వెళ్లి ట్యాప్ ఓపెన్ చేసుకుని మంచినీళ్లు (Cat Drinks Water) తాగుతోంది. ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. బుధవారం షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 79 లక్షల వ్యూస్ దక్కించుకుంది. 26 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. 38 వేల మంది ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశారు. Smart Cat అంటూ ఆ పిల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.