‘నేను స్కూలు దగ్గరున్నాను.. పుస్తకం తీసుకునిరా’ అంటూ ఆ కుర్రాడికి ఫోన్... తరువాత ఎంతటి ఘోరం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-10-17T17:04:55+05:30 IST

హరియాణాలోని ఫరీదాబాద్‌లో సంచలన ఉదంతం...

‘నేను స్కూలు దగ్గరున్నాను.. పుస్తకం తీసుకునిరా’ అంటూ ఆ కుర్రాడికి ఫోన్... తరువాత ఎంతటి ఘోరం జరిగిందంటే...

హరియాణాలోని ఫరీదాబాద్‌లో సంచలన ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడి పల్లా ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి, ఆ కుర్రాడి కుటుంబ సభ్యుల నుంచి రూ. 5 ఐదు లక్షలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని హత్య చేసి, మృతదేహాన్ని సూరజ్‌కుండ్ ప్రాంతంలో విసిరిపారేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. అక్టోబరు 15న సాయంత్రం 7 గంటల సమయంలో తన భర్త ఫోన్‌కు కాల్ వచ్చిందని మృతురాలి తల్లి తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి తమ కుమారుని గురించి అడగగా, ఆమె భర్త మీరు ఎవరితో మాట్లాడాలి? అని అడిగాడు. దీనికి అవతలివైపు వ్యక్తి తాను మీ కుమారుని స్నేహితుడినని చెప్పాడు. దీంతో ఇంటిలోని నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని భర్త చెప్పాడు. ఇంటిలోని ఫోన్‌కి కాల్ రావడంతో వారి కుమారుడు ఫోనులో మాట్లాడాడు. 


అవతలివైపు వ్యక్తి లెక్కల కాపీ పుస్తకం అడిగాడు. ఫోన్ కూడా తీసుకురావాలని చెప్పాడు. ఫోన్ ఎందుకు తీసుకురావాలని కుమారుడు అడగ్గా, తాను స్కూల్ దగ్గర నిలబడి ఉన్నానని, ఫోన్ తెస్తే సులువుగా గుర్తించవ్చని చెప్పాడు. దీని తర్వాత కొడుకు పుస్తకంతో పాటు ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి కొడుకు కిడ్నాప్‌కు గురైనట్లు కాల్ వచ్చిందని విద్యార్థి తల్లి తెలిపారు. కుర్రాడిని విడిచిపెట్టాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మాట విన్నవెంటనే వారు విష‌యాన్ని పోలీసుల‌కు తెలియ‌జేశారు. ఇంతలో వారి కుమారుడి మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. ఈ కేసుకు సంబంధించి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. 



Updated Date - 2022-10-17T17:04:55+05:30 IST