C.Kalyan: బంద్‌.. అట్టర్‌ఫ్లాప్‌ షో!

ABN , First Publish Date - 2022-12-10T12:38:19+05:30 IST

సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి నెల రోజులపాటు షూటింగ్‌లు బంద్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ నెల రోజుల బంద్‌ వృధా అనీ, అదొక అట్టర్‌ఫ్లాప్‌ షో అనీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ అన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

C.Kalyan: బంద్‌.. అట్టర్‌ఫ్లాప్‌ షో!

సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న (TFI) సమస్య పరిష్కారానికి నెల రోజులపాటు షూటింగ్‌లు బంద్‌ (Shooting bund)చేసిన సంగతి తెలిసిందే. ఆ నెల రోజుల బంద్‌ వృధా అనీ, అదొక అట్టర్‌ఫ్లాప్‌ షో అనీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ (C kalyan)అన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు, సినిమా విడుదలకు చాలా సమస్యలున్నాయి. వాటికి పరిష్కారం దొరుకుతుందని షూటింగ్స్‌ బంద్‌కు అంగీకరించాను. మొదటి నాలుగు సమావేశాల్లోనే దీని వల్ల ఏ ఉపయోగం ఉండదని అర్థమైపోయింది. ఆ మీటింగ్‌ వల్ల పలు సమస్యలు, లోపాలను గుర్తించిన మాట వాస్తవం. వాటికి పరిష్కార మార్గం దొరకలేదు. కొందరి వ్యక్తిగత లాభాల కోసం చేసుకున్న బంద్‌ అది’’ అని సి.కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. (C kalyan counter to Dil raju)

అలాగే సంక్రాంతి సినిమాలు, థియేటర్ల ప్రాధాన్యం గురించి కూడా ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా జరుపుకొనే సంక్రాంతికి తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.. అనువాద చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదనే విషయంపై ఆయన మాట్లాడారు. ‘‘వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం శోచనీయం. ఇదే జరిగితే ఇండస్ట్రీకి మంచి చేస్తున్న ఇద్దరు అగ్ర హీరోలను పరిశ్రమ అవమానించడమే అవుతుంది. దీనిపై దిల్‌ రాజు స్పందించాలని, తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనకు కట్టుబడి ఉన్నట్లు తెలపాలని కోరారు.

‘‘తెలుగు నిర్మాతల మండలి ఎగ్జిబిటర్‌లకు విజ్ఞప్తి చేసింది. ‘వారసుడు’కు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారనే వాదన రావడంతో తెలుగు నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. తమిళ, కన్నడ పరిశ్రమలో వాళ్ల సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలోనూ తెలుగు చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. మనమే మన సినిమాఉ చంపుకోకూడదు’’ అని సి.కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-12-10T12:38:20+05:30 IST