చెల్లి మృత దేహం వద్ద విలపిస్తూ కూర్చున్న అన్నయ్య.. ‘‘ఎలా చనిపోయిందో తెలుసా..?’’ అంటూ పక్కింటి వాళ్లు చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-02-19T23:59:56+05:30 IST

చెల్లి శవం వద్ద అన్న బోరున విలపిస్తూ ఉండగా... పక్కింటి వారు అతన్ని ఓదార్చుతూ... ఆయన బాధను చూసి తట్టుకోలేక.. ‘‘మీ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా’’.. అంటూ అసలు నిజం తెలియజేశారు. వారు చెప్పింది విని అంతా షాక్‌కు గురయ్యారు..

చెల్లి మృత దేహం వద్ద విలపిస్తూ కూర్చున్న అన్నయ్య.. ‘‘ఎలా చనిపోయిందో తెలుసా..?’’ అంటూ పక్కింటి వాళ్లు చెప్పింది విని..

అత్తింట్లో చెల్లి ఆనందంగా ఉందని అన్నతో పాటూ కుటుంబ సభ్యులంతా నిశ్చింతగా ఉండేవారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ రోజు అన్నకు ఫోన్ వచ్చింది. చెల్లి చనిపోయిందన్న వార్త తెలిసి అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. చెల్లి శవం వద్ద అన్న బోరున విలపిస్తూ ఉండగా... పక్కింటి వారు అతన్ని ఓదార్చుతూ... ఆయన బాధను చూసి తట్టుకోలేక.. ‘‘మీ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా’’.. అంటూ అసలు నిజం తెలియజేశారు. వారు చెప్పింది విని అంతా షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ పాట్నా పరిధిలోని నవాడ సమీపంలోని మహారత్ కాషిచక్ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణకుమార్‌కు కోమల్ అనే యువతితో 2019 మేలో వివాహమైంది. సవ్యంగా సాగుతున్న వారి సంసారంలో సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి. కోమల్‌ను కొన్నాళ్లు బాగా చూసుకున్న భర్త, అత్తమామలు.. తర్వాత అదనపు కట్నం పేరుతో వేధించడం మొదలెట్టారు. తనకు కారు కొనివ్వాలంటూ కృష్ణకుమార్ రోజూ భార్యను వేధించేవాడు. కోమల్ మామ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండడంతో అధికార బలంతో మరింత వేధించడం మొదలెట్టారు.

కొద్ది రోజుల్లో పెళ్లి.. డాబా మీద దుస్తులు ఆరేద్దామని వెళ్లిందా 20 ఏళ్ల యువతి.. ఊహించని రీతిలో..


ఈ క్రమంలో శుక్రవారం కృష్ణకుమార్, అతడి తల్లిదండ్రులు కలిసి కోమల్‌పై కట్నం పేరుతో దాడి చేయడం మొదలెట్టారు. ఎలాగైనా కోమల్‌ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో స్తంభానికి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. కేకలు పెట్టకుండా నోట్లో చేతి రుమాలును కుక్కారు. కుక్కర్ పేలడంతో గాయాలయ్యాయని అందరినీ నమ్మించి, ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు నటించారు. తర్వాత కోమల్ సోదరుడైన రాహుల్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. దీంతో షాక్ అయిన రాహుల్ కుటుంబ సభ్యులు.. పరుగు పరుగున కోమల్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. కోమల్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ క్రమంలో పక్కింటి వారు అసలు విషయాన్ని రాహుల్‌కు తెలియజేశారు. రాహుల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అతడి తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.

నా భార్య తప్పు చేస్తోంది.. ఇలాంటామె నాకు వద్దు.. అంటూ పంచాయితీలో ఆ భర్త కామెంట్స్.. మరుక్షణమే షాకింగ్ సీన్..

Read more