భార్య చెప్పింది విని మార్కెట్‌కు వెళ్లిన భర్త.. తిరిగొచ్చాక ఆమె చేసింది చూసి అతడు షాక్.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగు..

ABN , First Publish Date - 2022-03-06T00:56:32+05:30 IST

భార్య చెప్పింది విని ఇంట్లోకి సరుకులు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన భర్తకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భార్య చేసిన పనిని గుర్తించిన భర్త విస్తుపోయాడు. ఆ తర్వా

భార్య చెప్పింది విని మార్కెట్‌కు వెళ్లిన భర్త.. తిరిగొచ్చాక ఆమె చేసింది చూసి అతడు షాక్.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగు..

ఇంటర్నెట్ డెస్క్: భార్య చెప్పింది విని ఇంట్లోకి సరుకులు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన భర్తకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భార్య చేసిన పనిని గుర్తించిన భర్త విస్తుపోయాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం ఉషా పాల్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమలో మునిగి తేలిన ఇద్దరూ కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే  ఇంట్లోకి సరుకులు తీసుకురమ్మని ఉషా పాల్ చెప్పడంతో సదరు వ్యక్తి మార్కెట్‌కు వెళ్లాడు. తీరా మార్కెట్ నుంచి తిరిగి వచ్చాక.. ఇంట్లో ఉషా పాల్ కనిపించకోవడంతో ఖంగుతిన్నాడు. భార్య కోసం చుట్టు పక్కల వెతికి చూశాడు. అయితే ఎంతకూ ఆమె జాడ దొరకలేదు. అనంతరం బెడ్‌రూమ్‌లో కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యాడు. లాకర్‌లో పెట్టిన నగలూ, డబ్బు లేకపోవడంతో షాకయ్యాడు. పెళ్లి పేరుతో ఉషా పాల్ తనను మోసం చేసిందని గ్రహించి.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
Read more