కాబోయే భర్త గురించి నిజం తెలిసి.. పెళ్లి పీటల మీదే స్పృహ తప్పి పడిపోయిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2022-02-25T22:54:41+05:30 IST

వధవు మెడలో వరుడు తాళి కట్టే కొద్ది నిమిషాల ముందు అనూహ్యంగా పెళ్లి పెటాకులైంది. వరుడుకి సంబంధించిన ఓ సీక్రెట్ వధువుకు తెలియడంతో పెళ్లి పీటలపైనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ

కాబోయే భర్త గురించి నిజం తెలిసి.. పెళ్లి పీటల మీదే స్పృహ తప్పి పడిపోయిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇంటర్నెట్ డెస్క్: వధవు మెడలో వరుడు తాళి కట్టే కొద్ది నిమిషాల ముందు అనూహ్యంగా పెళ్లి పెటాకులైంది. వరుడుకి సంబంధించిన ఓ సీక్రెట్ వధువుకు తెలియడంతో పెళ్లి పీటలపైనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకున్న పెళ్లి కూతురు.. పెళ్లికి నిరాకరించింది. అతడిని పెళ్లి చేసుకోబోయేది లేదంటూ తేల్చి చెప్పేసింది. అచ్చం సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


ఇటావా జిల్లాలోని బర్తనా ప్రాంతానికి చెందిన ఓ యువతికి అజయ్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి జరగాల్సిన పెళ్లికి వరుడు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి మంటపానికి చేరుకున్నాడు. పెళ్లికి ముందు జరిగే తంతులో భాగంగా వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ సమయంలో వరుడు పదేపదే కంగారుగా తన తలపాగాను సర్దుకోవడం వధువు గమనించింది. వరుడు కంగారు పడటం చూసి వధువుకు అనుమానం కలిగింది. అతడి వైఖరి గురించి అక్కడున్న కొందరు బంధువులను ఆరా తీసింది. దీంతో వరుడికి బట్టతల ఉందనే విషయం బయటపడింది. అది కవర్ చేసుకోవడానికి అతడు విగ్ ధరించాడని వధువుతో అక్కడున్న వారు చెప్పారు. దీంతో ఆమె స్పృహ తప్పి పెళ్లి పీటల మీదే పడిపోయింది. కొద్దిసేపటికే తేరుకున్న వధువు.. వరుడికి బట్టతల ఉందనే నిజం దాచి తనని పెళ్లికి ఒప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోను అతడిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నించారు. అయినా ఆమె అంగీకరించలేదు. దీంతో చేసేదేమి లేక వరుడు, అతని తరఫు బంధువులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటన బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటించిన ‘బాల’ చిత్రాన్ని తలపించేలా ఉందని స్థానికులు చెప్పుకుంటున్నారు.
Updated Date - 2022-02-25T22:54:41+05:30 IST