బ్రహ్మోస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?... దాని శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలిస్తే...
ABN , First Publish Date - 2022-12-31T11:16:30+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా పరిగణించబడుతుంది. జలాంతర్గామి ద్వారా, యుద్ధనౌక గుండా, విమానం నుంచి, భూమి నుండి కూడా దీనిని ప్రయోగించవచ్చు.
ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే అవకాశం ఇవ్వదు. బ్రహ్మోస్‌లో పలు రకాలు ఉన్నాయి. అయితే ఈ క్షిపణి (బ్రహ్మోస్) పేరుకు గల అర్థం ఏమిటో తెలుసా? ఈ క్షిపణికి ఈ పేరు ఎలా? ఎందుకు వచ్చిందనే విషయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మోస్ ఎందుకు చర్చల్లో ఉంది?
ఈ క్షిపణి గత కొన్ని రోజులుగా ముఖ్యాంశాలలో కనిస్తోంది. ఇటీవల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన ఎయిర్ లాంచ్ వెర్షన్‌ను పలుమార్లు పరీక్షించారు. బ్రహ్మోస్ శక్తికి శత్రు దేశాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దాని సామర్థ్యంతో పాటు, దాని పేరు కారణంగా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఏ రెండు నదుల పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. బ్రహ్మోస్కోను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. దీనికి భారతదేశం, రష్యాలకు చెందిన రెండు ప్రధాన నదుల పేర్లు పెట్టారు. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.