ఆమె అతనికి కాబోయే భార్య.. ఆరేళ్లుగా ఆమె దాచిన రహస్యం అతనికి తెలియడంతో...

ABN , First Publish Date - 2022-10-03T17:33:27+05:30 IST

తనకు కాబోయే భార్యకు సంబంధించిన ఒక రహస్యం తెలియడంతో...

ఆమె అతనికి కాబోయే భార్య.. ఆరేళ్లుగా ఆమె దాచిన రహస్యం అతనికి తెలియడంతో...

తనకు కాబోయే భార్యకు సంబంధించిన ఒక రహస్యం తెలియడంతో అతనికి హృదయం బద్దలయినంత పనయ్యింది. అతనికి కాబోయే భార్య ఆ విషయాన్ని గత ఆరేళ్లుగా దాచి ఉంచింది. దీంతో అతను ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలా? వద్దా అనే సందేహంలో పడ్డాడు. సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశాడు. జాన్ అనే యువకుడు రీడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో తన ఆవేదనను వెళ్లగక్కాడు.


తనకు కాబోయే భార్య తన సోదరుని మాజీ గర్ల్ ఫ్రెండ్ అని ఇటీవలే తెలిసిందన్నాడు. ఈ విషయం తెలియగానే తన కిందనున్న భూమి కంపించినట్లయ్యిందని తెలిపాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలు ఎప్పుడూ తనతో చెప్పలేదన్నాడు. అయితే 5 నెలల క్రితమే ఆమెతో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు ఆమె గర్భవతి అని వివరించాడు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు కాబోయే భార్యకు సంబంధించిన ఈ విషయం తెలిసిందన్నాడు. దీంతో ఇప్పుడు తనకు ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. తమ పెళ్లికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు తనకు కాబోయే భార్య స్నేహితురాలొకరు ఈ విషయాన్ని తెలియజేశారన్నాడు. మొదట్లో దీనిని నమ్మలేదని, అయితే ఆమె కొన్ని రుజువులు చూపించడంతో దీనిని నమ్మవలసి వచ్చిందన్నాడు. దీనిపై తన సోదరుడిని ప్రశ్నిద్దామంటే, అతనికి పెళ్లయ్యిందని, దీనిని అడిగితే అతని వైవాహిక జీవితం చిన్నాభిన్నమవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తనకు ఏమి చేయాలో తెలియడం లేదని జాన్ పేర్కొన్నాడు. 

Read more