ట్రక్కును ఆపి యువకుల నాగిని డాన్స్... వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-07-13T17:41:01+05:30 IST

తాజాగా 'నాగిని డ్యాన్స్' వీడియో ఒకటి సోషల్ మీడియాలో...

ట్రక్కును ఆపి యువకుల నాగిని డాన్స్... వీడియో వైరల్!

తాజాగా 'నాగిని డ్యాన్స్' వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లిళ్లలో తరచూ వినిపించే నాగిని ట్యూన్ ఈసారి రోడ్డుపైనే వినిపించింది. ఈ మ్యూజిక్ విన్నప్పుడు జనం ఊగిపోతుంటారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్త నీలకంఠ్ బక్షి ట్వీట్ చేశారు. దీనిని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేశారు. చిన్నపాటి వర్షం మధ్య యువకులు బైక్ దిగి, ట్రక్కును మధ్యలో ఆపి, ఫుల్ సౌండ్‌తో నాగిని ట్యూన్‌కు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అదే దారిలో వెళుతున్న మరికొందరు యువకులు కూడా తమ వాహనాలను పక్కకు పెట్టి, నాగిని డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది.Read more