భర్త, కూతురిని వదిలి తనతో వచ్చెయ్యమని మాజీ ప్రియుడి బెదిరింపులు.. ఆమె అతని మాట వినకపోవడంతో ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-06-03T19:47:22+05:30 IST

ఆ మహిళకు నాలుగేళ్ల క్రితం ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.. పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయమైంది..

భర్త, కూతురిని వదిలి తనతో వచ్చెయ్యమని మాజీ ప్రియుడి బెదిరింపులు.. ఆమె అతని మాట వినకపోవడంతో ఏం చేశాడంటే..

ఆ మహిళకు నాలుగేళ్ల క్రితం ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.. పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయమైంది.. కాబోయే భర్తే కదా అని అతనితో ఆమె కలిసి తిరిగింది.. ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు.. అయితే ఆ యువకుడికి సంబంధించి కొన్ని రహస్యాలు తెలియడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేశారు.. ఏడాది తర్వాత వేరే వ్యక్తికి తమ కూతురునిచ్చి పెళ్లి చేశారు.. ప్రస్తుతం ఆ యువతి ఒక కూతురికి జన్మనిచ్చి భర్తతో సంతోషంగా ఉంది.. అయినా మాజీ ప్రియుడు ఆమెను వదల్లేదు.. భర్తను, కూతురిని వదిలేసి తనతో వచ్చెయ్యమని బెదిరిస్తున్నాడు.. ఆమె తన మాట వినకపోవడంతో గురువారం ఆమెను కాల్చి చంపాడు. 


ఇది కూడా చదవండి..

పుట్టింటి నుంచి రానని మొండికేసిన భార్య.. ఆగ్రహంచిన పోలీస్ భర్త తుపాకీ పట్టుకెళ్లి ఎంత పని చేశాడంటే..


బీహార్‌లోని సుందర్‌వాస్‌కు చెందిన నేహా కుమారికి నాలుగేళ్ల క్రితం శక్తి సింగ్‌తో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. దీంతో శక్తి సింగ్, నేహ కలిసి తిరిగే వాళ్లు. ఫోన్ల ద్వారా గంటల కొద్దీ మాట్లాడుకునే వాళ్లు. అయితే శక్తి సింగ్‌కు దురలవాట్లు ఉన్నాయని తెలియడంతో నేహ తల్లిదండ్రులు ఆ పెళ్లిని రద్దు చేశారు. ఏడాది తర్వాత చందన్ సింగ్‌తో నేహకు వివాహం చేశారు. నేహకు వివాహం జరిగి, ఓ కూతురికి తల్లి అయిన తర్వాత కూడా శక్తి ఊరుకోలేదు. నేహకు, ఆమె భర్త చందన్‌కు ఫోన్లు చేసి బెదిరించేవాడు. భర్త, కూతురిని వదిలేసి తనతో రాకపోతే చంపేస్తానని నేహను ఎన్నోసార్లు బెదిరించాడు. 


శక్తి బెదిరింపులను నేహ, ఆమె కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. గురువారం సాయంత్రం ఇంట్లో నేహ తన కూతురితో కలిసి ఉంది. ఆ సమయంలో మరొక వ్యక్తితో కలిసి శక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో నేహ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. Updated Date - 2022-06-03T19:47:22+05:30 IST