పుట్టింటికి వెళుతున్నానని చెప్పి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతి.. అక్కడ వారిద్దరూ ఏం చేశారంటే..!

ABN , First Publish Date - 2022-03-15T23:09:10+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. అయితే ఇరు కుటుంబాల పెద్దలూ వారి ప్రేమను అంగీకరించలేదు..

పుట్టింటికి వెళుతున్నానని చెప్పి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతి.. అక్కడ వారిద్దరూ ఏం చేశారంటే..!

వారిద్దరూ ప్రేమికులు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. అయితే ఇరు కుటుంబాల పెద్దలూ వారి ప్రేమను అంగీకరించలేదు.. ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి జరిపించేశారు.. అత్తింటికి వెళ్లిన ఆమె తన ప్రియుడిని మర్చిపోలేకపోయింది.. ప్రేయసిని వదిలి ప్రియుడు కూడా జీవించలేనని నిశ్చయించుకున్నాడు.. పుట్టింటికి వెళ్తున్నానని భర్తతో చెప్పిన యువతి సోమవారం రాత్రి తన బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్‌కు చేరుకుంది.. అక్కడ ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 


రాజస్థాన్‌లోని మండల్ ప్రాంతానికి చెందిన సమీర్ సింగ్ అనే యువకుడు, గుడియా అనే యువతి కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు వారి ప్రేమను ఆమోదించలేదు. గుడియా తల్లిదండ్రులు ఆమెకు రామ్‌స్వరూప్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించేశారు. వివాహం తర్వాత అత్తింటికి వెళ్లిన గుడియా తన ప్రియుడిని మర్చిపోలేకపోయింది. మరోవైపు సమీర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కలిసి చనిపోదామని నిశ్చయించుకున్నారు. 


తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి సోమవారం సాయంత్రం గుడియా అత్తింటి నుంచి బయల్దేరింది. తన ప్రియుడితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు వెళ్లిన హోటల్ సిబ్బంది వారి ఆత్మహత్యల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-03-15T23:09:10+05:30 IST