Priya Vadlamani: తెలుగు, హిందీ అమ్మాయిలు ఇద్దరికీ ఎవరి కష్టాలు వారివి

ABN , First Publish Date - 2022-12-06T13:45:30+05:30 IST

ఇప్పుడు వస్తున్న యువ దర్శకులు తెలుగు అమ్మాయిలని తమ సినిమాలలో లీడ్ యాక్ట్రెస్ గా తీసుకొని, తెలుగు అమ్మాయిలని బాగానే ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారిలో ప్రియ వడ్లమాని ఒకరు. 'ముఖచిత్రం' అనే సినిమాలో ప్రియ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Priya Vadlamani: తెలుగు, హిందీ అమ్మాయిలు ఇద్దరికీ ఎవరి కష్టాలు వారివి

తెలుగు అమ్మాయిలు ఈమధ్య తెలుగు సినిమాల్లో బాగానే కనపడుతున్నారు. టాప్ స్టార్స్ తో, పెద్ద బడ్జెట్ సినిమాలు కాకపోయినా, ఇప్పుడు వస్తున్న యువ దర్శకులు తెలుగు అమ్మాయిలని తమ సినిమాలలో లీడ్ యాక్ట్రెస్ గా తీసుకొని, తెలుగు అమ్మాయిలని బాగానే ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారిలో ప్రియ వడ్లమాని ఒకరు. 'ముఖచిత్రం' అనే సినిమాలో ప్రియ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇందులో ప్రియ డ్యూయల్ రోల్ వేస్తున్నట్టుగా చెప్తోంది. "విజయవాడ దగ్గర సత్యనారాయణపురం లో కొంచెం అమాయకంగా వుండే ఒక పల్లెటూరి పిల్ల, సిటీ కి వచ్చి ఒక పెద్ద ప్లాస్టిక్ సర్జన్ ని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం ఎలా ఉంటుంది అన్నది ఒక పాత్ర. ఇంకోటి సిటీ లోనే పుట్టి పెరిగి కొంచెం రెబెల్ లా, మోడ్రన్ గా వుండే ఇంకో అమ్మాయి పాత్ర. ఇందులో నాకు నటనకి చాలా ఆస్కారం వుండే పాత్ర," అని చెప్పింది ప్రియ. (Priya Vadlamani is playing dual role in 'Mukhachitram' directed by Gangadhar. 'Colour Photo' directing Sandeep Raj is providing the story, screenplay and writing for this film.)

priyavadlamani-story3.jpg

రెండో పాత్ర అంటే సిటీ లో పెరిగిన అమ్మాయిగా నడిచేటప్పుడు చాల ఫన్ వుంది అని అంటోంది ప్రియ. ఇందులో ఒక మెసేజ్ కూడా వుంది అని చెప్తోంది. "ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడో చెప్పలేను, కానీ ఆడవాళ్ళకి సంబదించినదే అది. ఈ సినిమా కథ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూసాం, అలాగే వార్తల్లో విన్నాం కూడా. అందుకనే ఒక మెసేజ్ చెప్పాలని ప్రయత్నించాం, మా ప్రయత్నం విజయవంతం అవుతుందనే అనుకుంటున్నాం," అని చెప్పింది. ఈ సినిమాకి దర్శకుడు గంగాధర్ అయితే, కథ, స్క్రీన్ ప్లే, రచన సందీప్ రాజ్ అందిస్తున్నాడు. సందీప్ కి దర్శకుడిగా అతని మొదటి సినిమా 'కలర్ ఫోటో' కి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా ఏమైనా అలాంటివి ఆశిస్తున్నారా, అన్నదానికి తనదైన శైలిలో సమాధానం చెప్పింది ప్రియ. "ఆ సినిమాకి సందీప్ తో సహా అందరూ చాలా కష్టపడ్డారు, అది వాళ్ళందరి కృషి. ఆలా ఆ సినిమాకి అవార్డు వచ్చిందని ఆ క్రెడిట్ మా సినిమాకి ఎలా వాడుకుంటాం, వాడుకో కూడదు. కానీ మా 'ముఖ చిత్రం' కి తప్పనిసరిగా సహాయపడుతుంది ఎందుకంటే సందీప్ దర్శకుడిగా చేసిన మొదటి సినిమాకి అవార్డు రావటం," అని చెప్పింది.

priyavadlamani-story2.jpg

ఇది తన అయిదవ సినిమా అని, చాలా అంటే రెండేళ్ల విరామం తరువాత ఈ సినిమా చేశాను అని చెప్తోంది. "కావాలనే విరామం తీసుకున్నాను. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలి, అంటే నాకు ఒక మంచి నటనకి ఉండే పాత్ర దొరకాలి అని ఇంతకాలం ఎదురు చూసా. సందీప్ కథ రాసినప్పుడు ఆ తరువాత నాకు చెప్పినప్పుడు ఇది కచ్చితంగా నన్ను నేను నిరూపించుకునే సినిమా అవుతుంది అని కచ్చితంగా నాకు అనిపించింది. ఈ సినిమా నాకు ఒక మంచి బ్రేక్ ఇస్తుంది అని అనుకుంటున్నా," అని చెప్పింది ప్రియ వడ్లమాని. (Priya says that she deliberately took a break as she wanted to comeback with a performance oriented film to prove her)

priyavadlamani-story4.jpg

ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చాలామంది వస్తున్నారు అని చెప్పింది. "ఇప్పుడు వస్తున్నా యువ దర్శకులు చాలామంది తెలుగు అమ్మాయిలనే ప్రోత్సహిస్తున్నారు. చూడండి చాలామంది తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాలలో వున్నారు. మొదట్లో నేను అనుకునేదాన్ని తెలుగు అమ్మాయిలకే కష్టాలు, హిందీ నుండి వచ్చిన వాళ్ళకి ఏమి లేవు అని. కానీ నేను ప్రత్యక్షంగా చూసాను, హిందీ అమ్మాయిలకుండే కష్టాలు వాళ్ళకి వున్నాయి, మా తెలుగు అమ్మాయిలకుండే కష్టాలు మాకున్నాయి," అని చెపుతూ ఆ కష్ఠాలు ఏంటో చెప్పలేదు ప్రియ. ముందు ముందు ఇంకా చాలా మార్పు వస్తుంది, తెలుగు అమ్మాయిలు ఇంకా చాలామంది వస్తారు, సినిమాలు చేస్తారు అని చెప్పింది ప్రియా వడ్లమాని. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా మీదే ప్రియ చాలా అసలు పెట్టుకుంది. ఆమె అసలు ఫలించాలని ఆశిద్దాం. (Telugu girls are now shining in Telugu movies as the next generation directors are encouraging them, says Priya. She added both non-Telugu, Telugu both girls have their own problems)

Updated Date - 2022-12-06T14:17:59+05:30 IST