బ్లూటూత్‌కి దంతాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ విచిత్రమైన పేరు వెనుక వింత కహానీ ఇదే..

ABN , First Publish Date - 2022-01-13T12:57:39+05:30 IST

మీ ఫోన్‌లో ఉన్న బ్లూటూత్ సాయంతో..

బ్లూటూత్‌కి దంతాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ విచిత్రమైన పేరు వెనుక వింత కహానీ ఇదే..

మీ ఫోన్‌లో ఉన్న బ్లూటూత్ సాయంతో ఎటువంటి వైర్లు అవసరం లేకుండా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు.  బ్లూటూత్ ను యూజర్ ఫ్రెండ్లీగా పరిగణిస్తున్నారు. దీని సాయంతో డేటాను చాలా సులభంగా బదిలీచేయవచ్చు. అయితే  బ్లూటూత్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీనికి దంతాలతో ఏమైనా సంబంధం ఉందా? టూత్ అనే పదం దానిలోకి ఎలా చేరింది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. బ్లూటూత్ అనే పేరు ఏదో టెక్నాలజీకి సంబంధించినది కాడు. ఒక రాజు పేరని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇదేవిధంగా బ్లూటూత్ పేరు వెనుక నీలి దంతాలతో కూడా సంబంధం ఉందనే కథనాలు కూడా ఉన్నాయి. బ్లూటూత్‌కు ఆ పేరు మధ్యయుగంనాటి స్కాండినేవియన్ రాజు పేరు పెట్టారని ఒక రిపోర్టు చెబుతోంది.


ఇదే విషయం బ్లూటూత్ వెబ్‌సైట్‌లో కూడా ఉంది. ఆ రాజు పేరు హెరాల్డ్ గోర్మ్సన్. ఆ రాజుకు ఒక పన్ను నీలిరంగులో ఉంది. అది పుచ్చిపోయింది. అందుకే అతనిని బ్లూటూత్ అని పిలిచేవారట. అయితే బ్లూటూత్ యజమాని ఈ టెక్నాలజీకి ఆ రాజు పేరు ఎందుకు పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. మరోకథనం ప్రకారం బ్లూటూత్ టెక్నాలజీ పేరు 10వ శతాబ్దపు డానిష్ పాలకుడు హెరాల్డ్ బ్లూటూత్ పేరు నుండి వచ్చింది. అతను స్కాండినేవియా దేశాన్ని తన రాజ్యంలో కలుపుకోవడంతో అతని పేరు ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. ఇదేవిధంగా అనేక రాజ్యాలు జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. కింగ్ హెరాల్డ్ బ్లూటూత్.. తన దేశానికి ఇతర దేశాలను జోడించేవాడు. ఈ టెక్నాలజీలో ఇదే విధానం ఉన్నందున దీనికి బ్లూటూత్ అని పేరు పెట్టారని చెబుతుంటారు.Updated Date - 2022-01-13T12:57:39+05:30 IST