Biggboss 6: నోరు జారావ్‌... అన్నీ దగ్గరపెట్టుకుని మాట్లాడు!

ABN , First Publish Date - 2022-11-08T17:13:45+05:30 IST

బిగ్‌ బాస్‌ హౌస్‌లో 10వ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య అప్పటి వరకూ అంత ఆప్యాయంగా ఉన్నా నామినేషన్‌ ప్రక్రియ మొదలయ్యేసరికి ఒకరి తప్పులను ఒకరు బయటపెడుతుంటారు. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ ప్రక్రియలో కనిపించింది

Biggboss 6: నోరు జారావ్‌... అన్నీ దగ్గరపెట్టుకుని మాట్లాడు!

బిగ్‌ బాస్‌ హౌస్‌(Biggboss 6)లో 10వ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య అప్పటి వరకూ అంత ఆప్యాయంగా ఉన్నా నామినేషన్‌ (nominations)ప్రక్రియ మొదలయ్యేసరికి ఒకరి తప్పులను ఒకరు బయటపెడుతుంటారు. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ ప్రక్రియలో కనిపించింది. శ్రీసత్య, రాజ్‌, రోహిత్‌ మినహా మిగిలిన ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. కెప్టెన్‌ శ్రీసత్యతో నామినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందులో ఎక్కువ ఇనయాకు ఓట్లు పడ్డాయి. ఏకంగా 8 మంది  ఆమెను నామినేట్‌ చేశారు. గ్లాసులో ఉన్న నీళ్లు ఇంటి సభ్యుల మొహాన్ని కొట్టి నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. శ్రీసత్య.. ఆదిత్య, ఇనయను నామినేట్‌ చేసింది. ఇక్కడ కూడా ఆదిత్య, శ్రీసత్య మధ్య వివాదం జరిగింది. శ్రీసత్య–శ్రీహాన్‌ను ఉద్దేశించి ఇనయ మాట్లాడటాన్ని శ్రీసత్య ఎత్తిచూపింది. తదుపరి ఇనయ, రేవంత్‌ను, ఆదిరెడ్డి నామినేట్‌ చేశాడు. వాసంతి ఇనయ, ఆదిరెడ్డిలను నామినేట్‌ చేసింది. ఆ తరవాత వసంతిను రేవంత్‌ నామినేట్‌ చేశాడు. ఆమెను నామినేట్‌ చేయడానికి రేవంత్‌ చెప్పిన రీజన్‌ నచ్చలేదని ఆమె వాదనకు దిగింది.  ‘నేను అగ్రెసివ్‌ అని నన్ను రెండు వారాలు నామినేట్‌ చేశారు’ అని రేవంత్‌ అనగానే.. ‘‘అది అందరూ చెప్పేదే. నేను కొత్తగా చెప్పేదేముంది’’ అని వసంతి జవాబిచ్చింది. వెంటనే అందుకున్న రేవంత్‌ వినండి అంటూ ‘‘కావాలని ఒక వ్యక్తి మీద చేయి ఎత్తి కొట్టడం తప్పు. అక్కడ నేను హర్ట్‌ అయ్యానా.. తగిలింది.. చిన్న దెబ్బా.. పెద్ద దెబ్బా అనేది అనవసరం. కానీ, కొట్టాలనే ఇంటెన్షన్‌ రాంగ్‌’’ అని తన కారణం చెప్పాడు రేవంత్‌. ఆ కారణంతోనే నామినేట్‌ చేస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, ఇంటెన్షన్‌తో కొట్టలేదని వాసంతి వాదించింది. మరైతే, తనను రెండు సార్లు అగ్రెషన్‌ కారణంతో ఎందుకు నామినేట్‌ చేశారని రేవంత్‌ ప్రశ్నించాడు.  ఒక్కసారి చేయి ఎత్తి కొడితేనే మీరు అంతలా అంటున్నారే.. మరి ప్రతిసారి గేమ్‌లో మీరు అందరినీ తోేసయట్లేదా, కావాలనే చేయట్లేదా అని వసంతి ప్రశ్నించింది. ‘‘అయితే వాళ్లను నాకు అడ్డురావద్దని చెప్పండి?’’ అని రేవంత్‌ అన్నాడు. ‘‘మీకు ఎవరూ అడ్డురాకపోతే ఎవరూ ఆడరు.. మీరొక్కరే ఆడుకోంచి?’’ అని వసంతి బదులిచ్చింది. ‘‘నేనొక్కడినే ఆడాలా.. వేరేవాళ్లతో కలిసి ఆడాలా అనేది బిగ్‌ బాస్‌ చెప్తాడు మీరు కాదు’’ అని రేవంత్‌ కౌంటర్‌ ఇచ్చాడు.  ప్రూఫ్‌లతో సహా అందరూ చూశారంటూ వసంతి గట్టిగానే మాట్లాడింది. (Revanth Fire on vasanti)


మీకు ముందుకొచ్చి ఆడటానికి భయం. వెనకుండి ఆడటానికి ధైర్యం లేదు. వేరేవాళ్లు ట్రై చేశారు.. మీరు కనీసం అది కూడా చేయలేదు’’ అని రేవంత్‌ అనగానే.. ‘‘వేరేవాళ్లను తోేససి ఆడటం నాకు తెలీదు. నీలాగా ఒకరిని తోేససి, వాళ్లు ఏమైపోయినా ఫర్వాలేదు, నేను గెలిస్తే చాలనుకునేది నువ్వు. నీ కన్నా నేను చాలా బెటర్‌.. వెళ్లు’’ అంటూ వసంతి రిథమ్‌ మార్చేసింది. రేవంత్‌ను అప్పటి వరకు మీరు అని మాట్లాడిన వాసంతి.. నువ్వు దగ్గరికి వచ్చేసింది. దీనికి తోడు ‘వెళ్లు’ అని అనడంతో రేవంత్‌కు కోపం వచ్చింది. ‘‘వెళ్లు అంటే వెళ్లిపోను.. వేరేవాళ్లలా నేను చూస్తూ ఊరుకోను.. నాతో మాట్లాడేటప్పుడు అన్నీ దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి?’’ అని రేవంత్‌ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీనికి వసంతి కూడా ఊరుకోలేదు. ‘నువ్వు కూడా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు నాతో’’ అని బదులిచ్చింది. ‘‘ఒళ్లు గురించి నేను అనలేదు.. నోరు జారింది మీరు’’ అంటూ రేవంత్‌ రిప్లై ఇచ్చాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. 

ఈ వారం నామినేట్‌ అయిన ఇంటి సభ్యులు..

1. ఆదిత్య

2. మెరీనా

3. కీర్తి

4. ఫైమా

5. వసంతి

6. రేవంత్‌

7. ఆదిరెడ్డి

8. శ్రీహాన్‌

9. ఇనయ


Updated Date - 2022-11-08T17:17:08+05:30 IST