పోర్న్ సైట్ చూస్తున్న యువకుడు.. అందులో ఒక వీడియో చూసి షాక్.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు!
ABN , First Publish Date - 2022-02-03T17:53:10+05:30 IST
బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఖాళీ సమయంలో పోర్న్ సైట్ చూస్తున్నాడు..
బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఖాళీ సమయంలో పోర్న్ సైట్ చూస్తున్నాడు.. ఆ సమయంలో ఒక వీడియో అతని కంట పడింది.. ఆ వీడియో చూసి సదరు యువకుడు షాకయ్యాడు.. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది తను, తన గాళ్‌ఫ్రెండ్.. వెంటనే అతను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.
బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు తన ప్రేయసితో కలిసి కొన్ని రోజుల క్రితం ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఆమెతో కలిసి ఏకాంతంగా గడిపాడు. శృంగారం సాగించాడు. ఆ దృశ్యాలను హోటల్‌కు చెందిన కొందరు దుండగులు సీసీటీవీ కెమేరాల ద్వారా రికార్డు చేశారు. వాటిని నేరుగా అశ్లీల వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారు.
ఆ వీడియో తాజాగా బాధిత యువకుడి దృష్టికి వచ్చింది. మొదట ఆ వీడియో చూసి షాకైన బాధితుడు.. అది హోటల్ సిబ్బంది పనే అని భావించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి హోటల్ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆ వీడియోను వెబ్సైట్ నుంచి తొలగించాలని, హోటల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.